SBI WhatsApp Banking Services: దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ యూజర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. మరింత తేలికగా ప్రయోజనాలను అందించే లక్ష్యంతో వాట్సాప్ సేవలను ప్రారంభించింది. ఇకపై ఖాతాదారులు బ్యాంక్‌కు వచ్చే అవసరం లేకుండా కొన్ని సర్వీసుల్ని వాట్సాప్ ద్వారా (SBI WhatsApp Banking Services) అందించేందుకు సిద్ధమైంది.
ఇందుకోసం కస్టమర్లు యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం, ఏటీఎం సెంటర్‌కు వెళ్లే అవసరం కూడా లేదని ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా తెలిపారు. ట్విట్టర్లో యువర్ బ్యాంక్ ఈజ్ నౌ ఆన్ వాట్సాప్. బ్యాంక్ బ్యాలెన్స్, మినిస్టేట్మెంట్ వాట్సాప్‌లో పొందండి అంటూ ఎస్‌బీఐ ట్వీట్ చేసింది. అంతేకాదు వాట్సాప్‌లో ఎస్‌బీఐ సేవలు ( account balance, mini statement) పొందాలనుకుంటే కస్టమర్లు ఇంగ్లీష్‌లో 'హాయ్' అని టైప్ చేసి 9022690226 నెంబర్‌కు మెసేజ్ చేయాలని తెలిపింది.
వాట్సాప్‌లో ఎస్‌బీఐ సేవలు పొందడం ఎలా ?
ముందుగా మీరు ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్‌కు యాడ్ చేసిన ఫోన్ నెంబర్‌కు ఎస్‌బీఐ సేవలు వాట్సాప్‌లో పొందాలంటే.. అందుకు మీరు కొన్ని పద్దతుల్ని అనుసరించాల్సి ఉంటుంది. ముందుగా బ్యాంక్‌లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 917208933148కు WAREG(కేపిటల్ లెటర్స్) అని టైప్ చేసి అకౌంట్ నెంబర్ ఎస్‌ఎంఎస్ చేయండి.
Your bank is now on WhatsApp. Get to know your Account Balance and view Mini Statement on the go.#WhatsAppBanking #SBI #WhatsApp #AmritMahotsav #BhimSBIPay pic.twitter.com/5lVlK68GoP
— State Bank of India (@TheOfficialSBI) July 19, 2022
మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత 919022690226 నంబర్‌పై 'హాయ్' SBI అని టైప్ చేయండి లేదా "ప్రియమైన కస్టమర్, మీరు ఎస్‌బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవల కోసం విజయవంతంగా నమోదు చేసుకున్నారు" అని వాట్సాప్‌లో మీకు వచ్చిన మెసేజ్‌కు రిప్లయి ఇవ్వండి.
మీరు వాట్సాప్ పైన పేర్కొన్న నెంబర్‌కు రిప్లయి ఇస్తే ఇలా మెసేజ్ వస్తుంది.
ప్రియమైన వినియోగదారులారా,ఎస్‌బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలకు స్వాగతం!
1. బ్యాంక్ బ్యాలెన్స్
2. మినీ స్టేట్‌మెంట్
3. వాట్సాప్ బ్యాంకింగ్ నుండి డిఈ-రిజిస్టర్ చేసుకోండి
మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి లేదా మీ చివరి ఐదు ట్రాన్సాక్షన్‌లకు సంబంధించిన స్టేట్మెంట్(మినీ) పొందడానికి 1 లేదా 2 ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. మీరు ఎస్‌బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ నుండి డిఈ-రిజిస్టర్ చేయాలనుకుంటే..మీరు 3 ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. మీరు పైన పేర్కొన్నట్లుగా సెలక్ట్ చేసుకుంటే బ్యాంక్ బ్యాలెన్స్ లేదా మినీ స్టేట్మెంట్ పొందవచ్చు. మిగిలిన సంబంధ వివరాలు కావాలనుకుంటే టైప్ చేసి అడగొచ్చు. ఎస్‌బీఐ ఈ వాట్సాప్ సేవల్ని తన క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు అందిస్తుంది. వాట్సాప్ కనెక్ట్ పేరుతో క్రెడిట్ కార్డ్ కస్టమర్లు అకౌంట్ డీటెయిల్స్,రివార్డ్ పాయింట్లు, బ్యాలెన్స్, కార్డ్ చెల్లింపులతో పాటు పలు సేవలు అందుబాటులో ఉన్నాయి.