SBI: ఖాతాదారులకు ఎస్‌బీఐ భారీ షాక్, నేటి నుంచి పెరగనున్న రుణాల వడ్డీ రేట్లు, పెరగనున్న హోం లోన్‌, పర్సనల్‌ లోన్‌, కార్‌ లోన్‌పై చెల్లించే ఈఎంఐలు
State Bank of India (Photo Credits: PTI)

ఖాతాదారులకు ఎస్‌బీఐ భారీ షాకిచ్చింది. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లెండింగ్‌ రేట్‌ (ఎంసీఎల్‌ ఆర్‌ )రుణాల్ని (SBI Hikes Lending Rates) 10బీపీఎస్‌ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. నేటి నుంచి ఈ సవరించిన ఈఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయి. దీంతో నేటి నుంచి రుణాలు తీసుకున్న వారు, లేదంటే తీసుకునే ప్రయత్నాల్లో ఉన్న వారికి మరింత అదనపు భారం( Loans Get Costlier) పడనుంది. ఈ ఎంసీఎల్‌ఆర్‌ను వాడుక భాషలో సింపుల్‌గా చెప్పుకోవాలంటే.. వివిధ బ్యాంకుల్లో (బ్యాంకును బట్టి మారతాయ్‌) ఏదైనా లోన్‌ తీసుకోవాలంటే.. ఆ లోన్‌లపై మినిమం ఇంత మొత్తంలో వడ్డీ కట్టాల్సి ఉంటుంది. లోన్‌లతో పాటు, టెన్యూర్‌ను బట్టి లోన్లపై బ్యాంకులు వడ్డీని విధిస్తాయి.

ఈ విధానాన్ని ఆర్బీఐ 2016లో అందుబాటులోకి తెచ్చింది. అప్పటి నుంచి బ్యాంకుల్లో ఎంసీఎల్‌ఆర్‌ను ఆధారంగా హోం లోన్‌, పర్సనల్‌ కార్‌ లోన్లపై ఇంట్రస్ట్‌ రేట్లు తగ్గుతుంటాయి.పెరుగుతుంటాయి. ఈ ఏడాది జూన్‌ నెలలో ఇదే ఎంసీఎల్‌ఆర్‌పై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేట్లు సామాన్యుడి తీవ్ర ప్రభావం చూపనుంచి ముఖ్యంగా హోం లోన్‌, పర్సనల్‌ లోన్‌, కార్‌ లోన్‌పై చెల్లించే ఈఎంఐ పెరగనుంది.

మీకు ఆధార్ కార్డు ఉందా? అయితే ఈ యాప్ మీకు చాలా యూజ్‌ఫుల్, వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి, ఫేస్ అథంటికేషన్ కోసం ఇక క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు

ఎస్‌బీఐ అధికారిక ప్రకటన ప్రకారం..ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు టెన్యూర్‌ను బట్టి మారాయి. ఒక నెల నుంచి 3నెలల టెన్యూర్‌ మధ్య కాలానికి వడ్డీ రేట్లు 7.05శాతం నుంచి 7.15 శాతానికి పెరిగాయి. అలాగే 6నెలల టెన్యూర్‌ కాలానికి 7.35 శాతం నుంచి 7.45 శాతానికి పెరిగాయి. ఇక వన్‌ ఇయర్‌ టెన్యూర్‌ కాలానికి 7.40 శాతం నుంచి 7.50 శాతానికి పెరిగాయి. 2 ఏళ్ల టెన్యూర్‌ కాలానికి 7.60 శాతం నుంచి 7.70శాతానికి పెరిగాయి. 3ఏళ్ల టెన్యూర్‌ కాలానికి 7.70శాతం నుంచి 7.80 శాతానికి పెరిగాయి.