New Delhi, July 15: ఆధార్ కార్డు (Aadhar card) యూజర్లకు గుడ్‌న్యూస్.. యూఐడీఏఐ నుంచి కొత్త యాప్ వచ్చింది. ఆధార్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎన్నో మార్గదర్శకాలను తీసుకొచ్చింది. లేటెస్టుగా యూఐడీఐ (UIDI) కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. UIDAI ఆధార్ ఫేస్ అథంటికేషన్ RD పేరుతో కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్ (APP) ద్వారా ఆధార్ కార్డుదారులు ఎక్కడి నుంచి అయినా ఫేస్ అథంటికేషన్ (Aadhaar Face Authentication) ను పూర్తి చేసుకోవచ్చు. మీ మొబైల్‌లో యాప్ ఉంటే చాలు.. ఫోన్ ద్వారా మీ ఫేస్ స్కానింగ్‌తో (Face scaning)అథంటికేషన్ పూర్తి చేసుకోవచ్చు. UIDAI నిర్ణయంతో చాలా మందికి ఆధార్ యూజర్లకు లబ్ది చేకూరనుంది. యూఐడీఏఐ ఆర్‌డీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆధార్ యాప్ సర్వీస్‌ను జీవన్ ప్రమాణ్ (jeevan praman), PDS, స్కాలర్‌షిప్ స్కీమ్‌లు, కోవిడ్, ఫార్మర్ వెల్ఫేర్ స్కీమ్స్ వంటి ఉపయోగించుకోవచ్చని UIDAI ట్వీట్‌లో తెలిపింది.
Residents are now using the #Aadhaar Face Authentication feature by downloading the #UIDAI #RDApp, which can be used for various #Aadhaar Authentication Apps like #JeevanPraman, #PDS, #Scholarship schemes, #COWIN, #FarmerWelfare schemes.@GoI_MeitY @ceo_uidai pic.twitter.com/c5cZNXEGOz
— Aadhaar (@UIDAI) July 12, 2022
ఆధార్ కార్డుదారులు తమ ఆధార్ నెంబర్‌లు, ఇతర డెమొగ్రాఫిక్, బయోమెట్రిక్ డేటాను ఫేస్ అథంటికేషన్ కోసం సెంట్రల్ ఐడెంటిటీ డేటా రెపోజిటరీలో పొందవచ్చు.
ఆధార్ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని UIDAI ఇన్‌హౌస్‌లో డెవలప్ చేసింది. Aadhaar FaceRD యాప్ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఆధార్ ధ్రువీకరణకు ఫేస్ క్యాప్చర్ చేస్తుందని UIDAI ట్వీట్‌లో తెలిపింది. మీ మొబైల్‌లో Google Play Store యాప్ ద్వారా Aadhaar FaceRD యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ ఫేస్ ను అథెంటికేషన్ పూర్తి చేయడానికి వీలుంటుంది.