SBI Server Down: ఎస్‌బీఐ సర్వర్లు డౌన్‌, నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ పేమెంట్స్‌, యోనో యాప్‌ సేవల్లో తీవ్ర అంతరాయం, ట్విటర్‌లో అసహనం వ్యక్తం చేసిన నెటిజన్లు

దీంతో బ్యాంక్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఎస్‌బీఐ నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ పేమెంట్స్‌, యోనో యాప్‌ పనిచేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్‌ల్లో తాము చేయాల్సిన లావాదేవీలు ఆగిపోయాయని వెంటనే సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఖాతాదారులు ట్విటర్‌లో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

SBI (Photo Credits: PTI)

ఎస్‌బీఐ సర్వర్లు ఒక్కసారిగా డౌన్‌ అయ్యాయి. దీంతో బ్యాంక్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఎస్‌బీఐ నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ పేమెంట్స్‌, యోనో యాప్‌ పనిచేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్‌ల్లో తాము చేయాల్సిన లావాదేవీలు ఆగిపోయాయని వెంటనే సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఖాతాదారులు ట్విటర్‌లో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

గుడ్ న్యూస్, 651 రకాల మందుల ధరలను తగ్గించిన కేంద్రం, ధ‌ర‌లు స‌గ‌టున 16.62 శాతం త‌గ్గిన‌ట్లు తెలిపిన NPPA

ఈ సమస్య మార్చి 31 నుంచి కొనసాగుతున్నట్లు తెలిపారు. సైబర్‌ అటాక్‌ జరిగిందా? లేదంటే బ్యాంకుల్లో సాధారణంగా జరిగే సర్వర్‌ సమస్యలా? అనే దానిపై సమాధానం చెప్పాలని, లేదంటే వినియోగదారులు పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని ట్వీట్‌లలో పేర్కొంటున్నారు. ఎస్‌బీఐ సర్వర్ల పనితీరుపై ప్రపంచ వ్యాప్తంగా సేవల్లో తలెత్తే అంతరాయాల్ని వెలుగులోకి తెచ్చే డౌన్‌ డిటెక్టర్‌ ఇండియా సంస్థ స్పందించింది. ఈ రోజు ఉదయం 9.19 గంటల నుంచి ఎస్‌బీఐ సేవల్లో లోపాలు తలెత్తినట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపింది.