కేంద్రం మందుల ధరల తగ్గింపుపై గుడ్ న్యూస్ చెప్పింది. అత్య‌వ‌స‌రంగా వినియోగించే సుమారు 651 మందుల(Essential Medicines) ధ‌ర‌లు స‌గ‌టున 6.73 శాతం త‌గ్గిన‌ట్లు నేష‌న‌ల్ ఫార్మాసిటిక‌ల్ ప్రైసింగ్ అథారిటీ(NPPA) పేర్కొన్న‌ది. ఏప్రిల్ నెల నుంచి ఈ త‌గ్గింపు అమలులోకి వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించింది. మందుల ధ‌ర‌ల‌ను నియంత్రించే ఎన్‌పీపీఏ సంస్థ త‌న ట్విట్టర్‌లో ఈ విష‌యాన్ని తెలిపింది.

ఎన్ఎల్ఈఎం(NLEM) లిస్టులో మొత్తం 870 షెడ్యూల్డ్ మందులు ఉన్నాయ‌ని, అయితే ఆ జాబితాలోని 651 మందులకు ప్ర‌భుత్వం సీలింగ్ విధించిన‌ట్లు తెలింది.తాజాగా విధించిన సీలింగ్‌తో ఆ 651 మందుల ధ‌ర‌లు మొత్తంగా 16.62 శాతం త‌గ్గిన‌ట్లు నేష‌న‌ల్ ఫార్మ‌సిటిక‌ల్ ప్రైసింగ్ అథారిటీ పేర్కొన్న‌ది. అయితే ఆ 651 మందుల‌కు ధ‌ర‌ల‌ను ఫిక్స్ చేయ‌డం వ‌ల్ల.. వాటి ధ‌ర‌లు 12.12 శాతం పెర‌గ‌కుండా.. ఏప్రిల్ నుంచి 6.73 శాతం త‌గ్గిన‌ట్లు ఎన్‌పీపీఏ తెలిపింది.సెప్టెంబ‌ర్ 2022లో ఎన్ఎల్ఈఎంను ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ(health ministry) స‌వ‌రించిన విష‌యం తెలిసిందే.

  Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)