SC on Private Properties: ఆర్టికల్ 39(బి) ప్రకారం అన్ని ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు, ప్రైవేటు ఆస్తులపై ప్రభుత్వ హక్కుల అంశంపై సుప్రీంకోర్ట్ కీలక తీర్పు

ఉమ్మడి ప్రయోజనాల కోసం పంపిణీ చేయడానికి ప్రైవేట్ ఆస్తులను రాష్ట్రం స్వాధీనం చేసుకోవచ్చా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్ తీర్పును వెలువరిస్తూ, అన్ని ప్రైవేట్ ఆస్తులు కాదని తీర్పు చెప్పింది.

Supreme Court sensational judgment on working journalists(X)

New Delhi, Nov 5: ఉమ్మడి ప్రయోజనాల కోసం పంపిణీ చేయడానికి ప్రైవేట్ ఆస్తులను రాష్ట్రం స్వాధీనం చేసుకోవచ్చా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్ తీర్పును వెలువరిస్తూ, అన్ని ప్రైవేట్ ఆస్తులు కాదని తీర్పు చెప్పింది. ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని ఆస్తులను ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడానికి వీలులేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు 8:1 మెజారిటీతో సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. అయితే కొన్ని కేసుల్లో మాత్రం మినహాయింపు ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఆర్టికల్ 39(బీ) ప్రకారం ప్రైవేట్ ఆస్తులను ‘సమాజ ముఖ్య వనరులు’గా పరిగణించవచ్చా?, పంపిణీ కోసం ప్రభుత్వాధికారులు స్వాధీనం చేసుకోవచ్చా? అనే న్యాయపరమైన ప్రశ్నలపై సీజే చంద్రచూడ్‌తో పాటు మరో ఏడుగురు న్యాయమూర్తులు అనుకూలంగా తీర్పుఇచ్చారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం రాష్ట్రాలు అన్ని ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చంటూ గతంలో వెలువడిన అన్ని తీర్పులను జడ్జిలు తోసిపుచ్చారు.

యూపీ మదర్సా ఎడ్యుకేషన్‌ చట్టం రాజ్యాంగబద్ధమే, కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు, అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు కొట్టివేత

రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బి) ప్రకారం అన్ని ప్రైవేట్ ఆస్తులు 'సమాజం యొక్క వస్తు వనరులు'లో భాగం కాలేవు. అయితే అన్ని ప్రైవేటు ఆస్తులూ సమాజ వనరులే.. ఈ రెండు పరస్పర భిన్నమైన విధానాలు. వీటిపై ప్రస్తుత ప్రైవేటీకరణ, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమకాలీన వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఉంది’’ అని అభిప్రాయపడింది. అయితే, కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ ఆస్తులపై రాష్ట్రాలు దావా వేయవచ్చని పేర్కొంది .

గతంలో ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. 1950ల్లో భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు వ్యాఖ్యానం చేయకూడదు. అప్పుడు జాతీయీకరణ జరుగుతోంది. ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోంది. ప్రైవేటు పెట్టుబడులు ఉన్నాయి. ఇది పరివర్తన. కాబట్టి న్యాయస్థానం వ్యాఖ్యానం కొత్తగా ఉండాలి. ప్రస్తుత భారత్‌కు అనుగుణంగా ఉండాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలి’’ అని ధర్మాసనం పేర్కొంది. తాజాగా ఈ వ్యాఖ్యలను పునరుద్ఘాటిస్తూ దీనిపై తాజా తీర్పు వెలువరించింది. ఈ మేరకు గతంలో జస్టిస్ కృష్ణయ్యర్ ఇచ్చిన తీర్పును మెజారిటీ తీర్పు తోసిపుచ్చింది.

కేవలం భౌతిక అవసరాలే అర్హతగా.. ఒక వ్యక్తికి చెందిన అన్ని ప్రైవేటు వనరులను కమ్యూనిటీ మెటీరియల్ రిసోర్స్‌గా పరిగణించకూడదని భావిస్తున్నాం. సందేహాస్పద వనరు గురించిన విచారణ రాజ్యాంగంలోని 39బీ నిబంధన కిందకు వస్తుంది. వనరుల స్వభావం, లక్షణాలు, సమాజానికి ఎంతవరకు ఉపయోగకరం, వనరుల కొరత, వనరుల పరిణామాలు వంటి అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజా విశ్వాస సిద్ధాంతం (Public trust doctrine) సమాజానికి సంబంధించిన వనరుల పరిధిలోకి వచ్చే ఆస్తులను గుర్తించడంలో దోహదపడుతుంది’’ అని సీజే చంద్రచూడ్ పేర్కొన్నారు.

అలాగే కోల్‌కతాలో పార్కు నిర్మాణం కోసమంటూ స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఓ వ్యక్తి ఆస్తిని స్వాధీనం చేసుకున్న కేసులోనూ సుప్రీం తీర్పునిస్తూ.. ‘‘చట్టప్రకారం మున్సిపల్‌ కార్పొరేషన్‌ నష్టపరిహారం చెల్లించినా సరైన పద్ధతులు మాత్రం పాటించలేదు. వ్యక్తుల ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించినప్పటికీ రాజ్యాంగం తగిన రక్షణ కల్పించింది.

నిర్బంధ స్వాధీనాలు, హడావుడి నిర్ణయాలు, న్యాయబద్ధంగాలేని పరిహారాల కారణంగా పౌరులు నష్టపోవడానికి చట్టం అనుమతించబోదు’’ అని ధర్మాసనం తెలిపింది. ఆస్తి స్వాధీనం విషయాన్ని ముందుగా తెలియజేయడం, తగినంత సమయం ఇవ్వడం, అభ్యంతరాలు స్వీకరించడం, వాటిని పరిష్కరించడం, పునరావాసం కల్పించడం, ప్రజాప్రయోజనం కోసమేనని వివరించడం వంటివన్నీ ప్రభుత్వాలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now