యూపీ మదర్సా ఎడ్యుకేషన్ చట్టం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు (Supreme Court) కీలకతీర్పు వెలువరించింది. ఈ చట్టాన్ని సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం.. గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. కాగా ఉత్తరప్రదేశ్ మదర్సా చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు దానిని రద్దు చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. ఇది రాజ్యంగ విరుద్దమంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనది కాదని తెలిపింది. ఈ తీర్పు 10వేల మదర్సా టీచర్లు, 17 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపైనా ప్రభావం చూపుతోందని అప్పట్లో పేర్కొంది. ప్రస్తుత తీర్పుతో 16వేల మదర్సాల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయి.
Supreme Court holds UP Madrasa Act
Supreme Court holds that the UP Madrasa Act is only unconstitutional to the extent that it granted higher education degrees under fazil and kamil, which is in conflict with the UGC Act.
— ANI (@ANI) November 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)