Kerala Teacher Fight Video (photo-Video Grab)

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు తరగతి గదిలో విద్యార్థుల ముందే దారుణంగా కొట్టుకున్నారు. ఉత్త‌ర కేర‌ళ జిల్లాలోని ఎర‌వ‌న్నూరులోని ఏయూపీ స్కూల్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ సంఘటనలో  ఏడుమంది టీచర్లు గాయపడ్డారు. క్లాస్ రూంలోనే టీచర్లు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి ఈ ఘ‌ట‌న గ‌త వార‌మే జ‌రిగినా.. ఆ దాడికి చెందిన వీడియో ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోను పరిశీలిస్తే.. స్కూల్‌లో జ‌రుగుతున్న మీటింగ్‌కు మ‌రో స్కూల్‌కు చెందిన టీచ‌ర్ వ‌చ్చి గొడవ సృష్టించాడు. గొడవ పడిన అతని భార్య ఈ స్కూలులో టీచర్ గా పనిచేస్తోంది.  భార్య‌ను పిక‌ప్ చేసుకునేందుకు స్కూల్‌కు వ‌చ్చిన అత‌ను.. ఆ మీటింగ్‌లో ఉన్న టీచ‌ర్ల‌తో ఘ‌ర్ష‌ణ‌కు దిగాడు. దీంతో టీచ‌ర్ల మ‌ధ్య గొడ‌వ మొద‌లై ఒక‌రిపై ఒక‌రు పంచ్‌లు విసురుకునే స్థాయికి చేరుకుంది.  టీచ‌ర్ షాజీని బుధ‌వారం అరెస్టు చేశారు. ఐపీసీ 332, 506, 294 సెక్ష‌న్ల కింద కేసు బుక్ చేశారు. స్థానిక కోర్టు ముందు అత‌న్ని హాజ‌రుప‌రిచారు.

Kerala Teacher Fight Video (photo-Video Grab)

Here's Video

 



సంబంధిత వార్తలు

Telangana State Formation Day 2024 Telugu Wishes: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ బంధు మిత్రులకు Photo Greetings రూపంలో శుభాకాంక్షలు తెలిజయేండిలా..

Woman Delivers Baby on KRSTC Bus: మానవత్వానికి మచ్చుతునక ఈ ఘటన.. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి బస్సులోనే కేరళ వైద్యుల ప్రసవం.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వైరల్ వీడియో ఇదిగో!!

Southwest Monsoon 2024 Update: ఐఎండీ చల్లని కబురు, వచ్చే వారం తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు, ఇప్పటికే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

Telangana Schools Working Hours: ఇక నుంచి ఉదయం 9 గంట‌ల‌కు తెరుచుకోనున్న స్కూల్స్, ప‌నివేళ‌లు మార్చుతూ విద్యాశాఖ నిర్ణ‌యం

School Academic Calendar: తెలంగాణ‌లో స్కూల్ విద్యార్ధుల‌కు ఎప్పుడెప్పుడు సెల‌వులు, ప‌రీక్ష‌లు ఉన్నాయంటే? అకాడ‌మిక్ క్యాలెండ‌ర్ విడుదల చేసిన విద్యాశాఖ‌

AP Student Dies in US Road Accident: అమెరికాలో బైక్ ప్రమాదం.. ఏపీ విద్యార్ధి బీలం అచ్యుత్ దుర్మరణం.. విచారం వ్యక్తం చేసిన ఎంబసీ.. మృతదేహాన్ని భారత్‌ కు తరలించేందుకు ఏర్పాట్లు

Job Crisis At IITs: దేశంలో టాప్ ఐఐటీలలో చదివినా విద్యార్థులకు నో జాబ్స్, సమాచార హక్కు చట్టం కింద సేకరించిన గణాంకాల్లో షాకింగ్ విషయాలు వెల్లడి

KKR vs SRH, IPL 2024: నాలుగవ సారి ఫైనల్‌కు చేరిన కోల్‌క‌తా నైట్ రైడర్స్, తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో విజయం