School Reopening Update: అక్టోబర్ 31 వరకు స్కూళ్లు బంద్, కీలక నిర్ణయం తీసుకున్న కేజ్రీవాల్ సర్కారు, అధికారికంగా వెల్లడించిన డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మ‌నీశ్ సిసోడియా

ఈ మేర‌కు ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మ‌నీశ్ సిసోడియా (Manish Sisodia) ఆదివారం ఒక ప్ర‌క‌ట‌న చేశారు. క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ‌ నేప‌థ్యంలో గ‌త ఏప్రిల్‌లో దేశంలోని అన్ని కార్య‌క‌లాపాల‌తోపాటే విద్యాసంస్థ‌లు మూత‌ప‌డ్డాయి. ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం కూడా సాధ్యం కాక‌పోవ‌డంతో విద్యార్థుల‌ను పై త‌ర‌గ‌తుల‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు.

Delhi Deputy Chief Minister Manish Sisodia (Photo Credits: IANS)

New Delhi, October 4: దేశ రాజ‌ధాని ఢిల్లీలో అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు పాఠ‌శాల‌లు మూసే ఉంటాయ‌ని కేజ్రీవాల్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మ‌నీశ్ సిసోడియా (Manish Sisodia) ఆదివారం ఒక ప్ర‌క‌ట‌న చేశారు. క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ‌ నేప‌థ్యంలో గ‌త ఏప్రిల్‌లో దేశంలోని అన్ని కార్య‌క‌లాపాల‌తోపాటే విద్యాసంస్థ‌లు మూత‌ప‌డ్డాయి. ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం కూడా సాధ్యం కాక‌పోవ‌డంతో విద్యార్థుల‌ను పై త‌ర‌గ‌తుల‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు.

అయితే, గ‌త జూన్‌లో నూత‌న విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం కావాల్సి ఉన్నప్ప‌టికీ ప‌రిస్థితి మెరుగుప‌డ‌క పోవ‌డంతో పాఠ‌శాల‌లు, కళాశాల‌లు తెరుచుకోలేదు. కానీ, కేంద్రం ఇచ్చిన లాక్‌డౌన్ స‌డ‌లింపుల మేర‌కు కొన్ని రాష్ట్రాల్లో పాఠ‌శాల‌ల‌ను పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ ప్ర‌భుత్వం త‌మ ద‌గ్గ‌ర ఈ నెల‌లో కూడా పాఠ‌శాల‌ల‌ను (Schools in Delhi Will Continue to Remain Shut Till October 31) ప్రారంభించ‌డం లేద‌ని స్ప‌ష్టంచేసింది.

గుడ్ న్యూస్, రూ.50కే ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌‌ను అందిస్తామని తెలిపిన ఢిల్లీ సిఖ్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ, దేశంలో తాజాగా 75,829 మందికి కరోనా, కోవిడ్ మరణాలపై బయటకొచ్చిన ఆసక్తికర విషయాలు

అయితే గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీలో కరోనా కేసులు (Coronavirus in India) పెరుగుతున్నాయి. గురువారం, శుక్రవారం, శనివారం వరుసగా 3,037, 2,920, 2,258 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,87,930 చేరగా.. ఈ మహమ్మరి కారణంగా 5,472 మంది మరణించారు. ఇదిలాఉంటే.. క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా మార్చిలో విధించిన లాక్డౌన్ నాటినుంచి అన్ని కార్యకలాపాలతోపాటు విద్యాసంస్థ‌లు కూడా మూత‌ప‌డ్డాయి.

ఈ క్రమంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హణ సాధ్యం కాక‌పోవ‌డంతో విద్యార్థుల‌ను పై త‌ర‌గ‌తుల‌కు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే జూన్‌లోనే నూత‌న విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం కావాల్సి ఉన్నప్ప‌టికీ ప‌రిస్థితి మెరుగుప‌డ‌క పోవ‌డంతో పాఠ‌శాల‌లు, కళాశాల‌లు తెరుచుకోలేదు. ఈ క్రమంలో కేంద్రం అన్‌లాక్ 5.0లో భాగంగా విద్యాసంస్థలు పునఃప్రారంభించేందుకు అనుమతిచ్చినప్పటికీ.. రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ‌