IPL Auction 2025 Live

Coronavirus: కరోనావైరస్ గుట్టు విప్పేశారు, షాకింగ్ నిజాలు వెల్లడించిన సైంటిస్టులు, దాని పుట్టుకకు రెండు కారణాలు చెబుతున్న శాస్త్రవేత్తలు, ప్రపంచం మొత్తం పాకుతున్న డెడ్లీ కరోనా వైరస్

ఈ డెడ్లీ కరోనా వైరస్‌ ఎలా పుట్టిందో అసలు దీని మూలాలేంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. దీని గుట్టు తెలిస్తే దీనికి నివారణ మార్గం తెలుస్తుంది. అయితే ఈ వ్యాధి ఎలా వస్తుందనే దానిపై ఇంతవరకు సరైన సమాచారం లేదు. తాజాగా పరిశోధనలు దీని గుట్టును విప్పినట్లు తెలుస్తోంది. ఇది ఎలా వచ్చిందనే దానికి రెండు కారణాలు చెబుతున్నారు.

Italy sees 651 new coronavirus deaths, toll nears 5,546(Photo-PTI)

Wuhan, January 28: ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఒకే ఒక వ్యాధి కరోనావైరస్ (Coronavirus Outbreak). ఈ డెడ్లీ కరోనా వైరస్‌  ఎలా పుట్టిందో అసలు దీని మూలాలేంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. దీని గుట్టు తెలిస్తే దీనికి నివారణ మార్గం తెలుస్తుంది. అయితే ఈ వ్యాధి ఎలా వస్తుందనే దానిపై ఇంతవరకు సరైన సమాచారం లేదు. తాజాగా పరిశోధనలు దీని గుట్టును విప్పినట్లు తెలుస్తోంది. ఇది ఎలా వచ్చిందనే దానికి రెండు కారణాలు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో కరోనా వైరస్ అలజడి

ఈ వ్యాధీ భారీన ఇప్పటికే 4500 మంది పడారనే వాస్తవాలు గుండెను పిండేస్తున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి (Coronavirus) సోకి 106 మంది చనిపోయారు. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి విశ్వవ్యాప్తమై తీవ్రమైన ఆందోళనను రేకెత్తిస్తోంది. కాగా చైనా లోని వుహాన్ (Wuhan) నగరంలో మొదలైన ఈ వ్యాధి అన్ని దేశాలను కలవరపెడుతూ చివరకు డాక్టర్లకు లొంగకుండా దూసుకుపోతోంది. సైంటిస్టులు (Scientists) చెప్పిన కారణాలను ఓ సారి పరిశీలిస్తే..

ప్రపంచ దేశాలకు పరుగులు

సైంటిస్టులు చెప్పిన మొదటి కారణం

చైనాలో పాములను తింటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వుహాన్ సిటీలో గబ్బిలాలను ( Bats) తిన్న పాములను (Snakes) ఎక్కుమంది తినడం ద్వారా వాటిలోని వైరస్ మనుషుల్లోకి సంక్రమించడం జరిగి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2019-NCoV అనే ప్రాణాంతక వైరస్ చైనాలోని క్రయిటా పాములు, కోబ్రా పాముల్లో ఉన్నట్టుగా సైంటిస్టులు తమ పరిశోధనల్లో గుర్తించారు.

డాక్టర్లను చంపేస్తున్న కరోనావైరస్

ఈ పాములు అడవిలో తిరిగే గబ్బిలాలను వెంటాడి తింటాయి. తద్వారా ఈ వైరస్ పాముల్లోకి ప్రవేశిస్తుంది. ఇదిలా ఉంటే వుహాన్ సిటీలో సీఫుడ్ మార్కెట్లో ఎక్కువగా పందులు, పాములు, గబ్బిలాలు, జంతువుల మాంసం అమ్ముతుంటారు. వీటిని తిన్న మనుషుల్లోకి (Humans) ఈ వైరస్ అంటువ్యాధిలా సోకి ఉంటుందని తేల్చేశారు.

Here's Chinese Food

వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ (WCS)

ఇదిలా ఉంటే జనవరి 23న వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ (WCS) అడవి జంతువుల మాంసంతో వ్యాపారం చేయడం ద్వారా ఇలాంటి వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణంగా మారుతోందని హెచ్చరించింది. అయితే ఇవేమి పట్టించుకోని చైనా వాసులు తాము గబ్బిలాలను, పాములను తింటున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

దీంతో వారి మీద నెటిజన్లు విమర్శలు ఎక్కుబెట్టారు. గత వారం ఇదే విధంగా చైనీస్ సెలబ్రిటీ వాంగ్ మెంగ్యూమ్ 2017లో తాను వేయించిన గబ్బిలాన్ని తింటున్న వీడియోను వైరల్ చేశారు. దీనిపై విమర్శలు రావడంతో క్షమాపణలు తెలియజేశారు.

సైంటిస్టులు చెప్పిన రెండో కారణం

2017లో చైనా వుహాన్ నేషనల్ బయో సేఫ్టీ ల్యాబరేటరీని (Wuhan National Biosafety Laboratory) స్థాపించింది. ఇక్కడ ఇలాంటి డెడ్లీ వైరస్‌లకు సంబంధించి అధ్యయనాలు చేస్తుంటారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వైరస్, వ్యాధికారక బ్యాక్టిరియాలపై ఈ ల్యాబ్‌లో పరిశోధనలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రపంచమే నాశనమవుతుందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇప్పుడు కూడా వ్యాధికారిక జీవులు, కోతులు(Monkeys) వంటి జంతువులపై పరీక్షలు జరిపే సమయంలో అవి బయటకు వచ్చి ఉంటాయని, వుహాన్ బయో ల్యాబరేటరీలో నుంచే కరోనా వైరస్ బయటకు లీక్ అయిందనే విషయాన్ని సైంటిస్టులు మరో కారణంగా చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా 2004లో SARS అనే వైరస్ ను చెబుతున్నారు. ఈ వైరస్ చైనా ల్యాబ్ ల నుంచే బయటకు వచ్చి ప్రపంచాన్ని వణికించింది.

China confirms 106 deaths It's winter now

106 మందికి పైగా మృతి : 4581కి పైగా కేసులు

ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి 106 మందికిపైగా మృతిచెందగా, మరో 4581కు పైగా కరోన వైరస్ కేసులు నమోదయ్యాయి. గాలిద్వారా వేగంగా వ్యాప్తిచెందే ఈ వైరస్‌ను ఎలా చంపేయాలన్న దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు ముమ్మరం చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దీనిపై పరిశోధనలు, అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఈ వైరస్ నివారణకు ఎలాంటి వ్యాక్సీన్, యాంటీ ట్రీట్ మెంట్ అందుబాటులో లేదు. కేవలం నివారణ మార్గం ఒక్కటేనని, ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇప్పటికే హాంగ్ కాంగ్, చైనా రెండు కరోనా వైరస్ ప్రభావంతో ఎమర్జెన్సీ ప్రకటించాయి. జనవరి 27 వరకు అధికారికంగా 2,700 వైరస్ కేసులు ఒక్క చైనాలోనే నమోదు అయ్యాయి. ఈ వైరస్ ప్రభావంతో దేశంలో అస్థిరత్వం నెలకొనడంతో చైనీస్ ఎకానమీ, స్టాక్ మార్కెట్లు కూడా ఒక్కసారిగా క్షీణించాయి.