Sec 144 Imposed in Mumbai: ముంబైలో 144 సెక్షన్ విధింపు, ఒమిక్రాన్ కట్టడికి కఠిన చర్యలు, బయటకు వస్తే చర్యలు తప్పవని హెచ్చరిక, పోటా పోటీ ర్యాలీలు ప్లాన్ చేసిన ఎంఐఎం, బీజేపీ

ముఖ్యంగా ముంబై (Mumbai)లో కేసులు పెరిగిపోతుండటంతో వీకెండ్స్‌ లో కఠిన ఆంక్షలను విధించింది. రెండు రోజుల పాటూ ముంబై పరిధిలో 144 సెక్షన్(Sec 144 Imposed in Mumbai) విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Curfew ANI | Representational Image)

Mumbai December 11: ఒమిక్రాన్ (Omicron) కట్టడి కోసం కఠిన చర్యలను చేపట్టింది మహారాష్ట్ర సర్కారు (Maharashtra Government). ముఖ్యంగా ముంబై (Mumbai)లో కేసులు పెరిగిపోతుండటంతో వీకెండ్స్‌ లో కఠిన ఆంక్షలను విధించింది. రెండు రోజుల పాటూ ముంబై పరిధిలో 144 సెక్షన్(Sec 144 Imposed in Mumbai) విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఒక్కరోజే మహారాష్ట్ర (Maharashtra)లో ఏడు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. దీనికి తోడు రాజకీయ సమావేశాల హడావుడి పెరిగింది. దీంతో ఓమిక్రాన్ కట్టడి కోసం చర్యలు చేపట్టారు.

ముంబైలో రెండు రోజులపాటు ర్యాలీ(Rallies)లు, బహిరంగ సభలు (morchas or procession), వాహనాల రాకపోకలపై నిషేధం(vehicles have been prohibited) విధించింది ముంబై మహానగర పాలక సంస్థ (BMC). ప్రజలు బయట తిరగడానికి వీళ్లేదని స్పష్టం చేసింది. ఆదేశాలను ధిక్కరించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

అయితే శనివారం రోజు ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) ముంబైలో పర్యటించనున్నారు. దీంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు ముంబై చేరుకున్నారు. దీన్ని అడ్డుకునేందుకు 48 గంటల పాటూ 144 సెక్షన్ విధించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ కూడా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. రాజకీయ ర్యాలీతో ఒమిక్రాన్ మరింత వ్యాప్తి చెందే అవకాశముందని బీఎంసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.

Omicron Cases in India: భారత్‌లో ఆగని ఒమిక్రాన్ విజృంభణ, మరో 7 ఒమిక్రాన్ కేసులు నమోదు, గుజరాత్, మహారాష్ట్రలో కొత్త కేసులు రికార్డు

మహారాష్ట్రలో శుక్రవారం కొత్తగా ఏడు ఒకమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 17కు చేరింది. ఇందులో ముంబై (Mumbai)లో మూడు కేసులు ఉండగా, పింప్రి ప్రాంతంలో నాలుగు కేసులు వెలుగు చూశాయి. ముంబైలో ఒమిక్రాన్‌ బారినపడిన ముగ్గురు టాంజానియా, యూకే, దక్షిణాఫ్రికా నుంచి వచ్చారని అధికారులు తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 32 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్రలో 17, రాజస్థాన్‌ 9, గుజరాత్‌ 3, కర్ణాటక 2, ఢిల్లీలో ఒకటి చొప్పున ఉన్నాయి.