New Delhi December 10: భారత్(India)లో ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) చాపకింద నీరులా విస్తరిస్తోంది. శుక్రవారం నాడు కొత్తగా ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 32కు చేరింది. మహారాష్ట్రలో ఒక్కరోజే 7 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వీటిలో ముంబైలో 3 కేసులు నమోదవగా, పింప్రి ప్రాంతంలో నాలుగు కేసులు వెలుగు చూశాయి. ఇప్పటివరకు ఐదు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవగా.. ఒక్క మహారాష్ట్రలోనే 17 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
గుజరాత్(Gujarat) లో తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి. గుజరాత్ (Gujarat)లోని జామ్‌నగర్(Jam nagar)లో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ కేసులు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 4న జింబాబ్వే (Zimbabwe) నుంచి భారత్ తిరిగొచ్చిన ఎన్నారైకి కోవిడ్ కొత్త వేరియంట్ సోకగా.. అతన్ని కలిసిన పది మందిని క్వారంటైన్ లో పెట్టారు.
One #Omicron case found in Dharavi area of Mumbai. The person had returned from Tanzania; now admitted at SevenHills Hospital: BMC (Brihanmumbai Municipal Corporation)
— ANI (@ANI) December 10, 2021
అతని ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల శాంపిల్స్ సేకరించి టెస్టింగ్‌కు పంపించారు. అందులో అతని భార్య, బావమరిదికి పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం గుజరాత్(Gujarat)లో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ముగ్గురికి ఎలాంటి లక్షణాలు లేవని, ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని, వారి ఆరోగ్యం స్థిరంగా ఉన్నదని జామ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్ ఖరాడి తెలిపారు.
ఇక ముంబై(Mumbai)లో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. ధారావి ఏరియా(Dharavi area )కు చెందిన వ్యక్తి ఇటీవల టాంజానియా(Tanzania) నుంచి భారత్‌కు తిరిగివచ్చాడు. అతని టెస్టుల్లో పాజిటివ్‌గా తేలడంతో....శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. అందులో ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది. దీంతో అతన్ని సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. 49 ఏళ్ల వ్యక్తి ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదని, అతనికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినప్పటికీ.. పెద్దగా లక్షణాలు కనిపించడం లేదన్నారు డాక్టర్లు.