Punjab Horror: లాక్‌డౌన్, కత్తులతో పోలీసులపై దాడి, పంజాబ్‌లో ఏఎస్ఐ చేయి నరికివేసిన నిహంగ్ వర్గీయులు, ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై కొంత మంది దాష్టీకానికి తెగబడ్డారు. ఒక్కసారిగా కత్తులతో దాడి (Punjab horror) చేశారు. ఓ పోలీసు అధికారి చేయి నరికేశారు. ఈ ఘటనలో మరో ఇద్దరు అధికారులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఏఎస్‌ఐని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Seven Arrested For Chopping Off Punjab Cop's Hand; Arms, Cash, Cannabis Recovered (Photo-ANI)

Chandigarh, April 12: కరోనా లాక్‌డౌన్‌ను (Coronavirus Lockdown) పక్కాగా అమలు చేస్తున్న క్రమంలో పంజాబ్‌లో పోలీసులపై దాడి (Policemen attacked by 'Nihangs') జరిగింది. లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై కొంత మంది దాష్టీకానికి తెగబడ్డారు. ఒక్కసారిగా కత్తులతో దాడి (Punjab horror) చేశారు. ఓ పోలీసు అధికారి చేయి నరికేశారు. ఈ ఘటనలో మరో ఇద్దరు అధికారులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఏఎస్‌ఐని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అమెరికాలో కరోనా మృత్యుఘోష, తరుముకొస్తున్న ఆర్థిక సంక్షోభం

పంజాబ్‌లోని పాటియాల జిల్లాలో (Patiala) ఆదివారం (ఏప్రిల్ 12) ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కూరగాయల మార్కెట్లో ప్రజలను నియంత్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన పోలీసు అధికారికి చంఢీగర్ ఆస్పత్రిలో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులకు పాదాభివందనం చేసిన ఎమ్మెల్యే

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారులో వచ్చిన ఓ వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బారికేడ్లను ఢీకొట్టి ముందుకు కదిలారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని ప్రశ్నించడంతో కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి ఏఎస్‌ఐ హర్జీత్‌ సింగ్‌పై తల్వార్‌తో దాడి చేశాడు. దీంతో అతని చేయి తెగిపడింది. మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.

Here's DGP Punjab Police Tweet

 

ఈ ఘటనపై పంజాబ్ పోలీస్ బాస్ దినకర్ గుప్తా ట్వీట్ చేశారు. నిహంగ్ వర్గానికి చెందిన కొంత మంది పోలీసులపై దాడి చేసినట్లు ఆయన వెల్లడించారు. ఘటనలో ఏఎస్‌ఐ హర్జీత్ సింగ్‌తో పాటు మండీ బోర్డు అధికారి గాయపడిన్నట్లు తెలిపారు.

పోలీసులపై పూల వర్షం

దాడికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే అధికారుల బృందానికి చేరుకున్నట్లు ఆయన వివరించారు. తీవ్రంగా గాయపడిన హర్జీత్‌ సింగ్‌ను చంఢీగర్‌లోని పీజీఐ ఆస్పత్రికి తరలించామని పంజాబ్‌ డీజీపీ దినకర్‌ దినకర్‌ గుప్తా తెలిపారు.

అడవి బిడ్డలకు ఆకులే మాస్కులు, ఎన్90 మాస్కులు కొనేందుకు చేతిలో డబ్బులు లేవు

పోలీసులపై దాడి చేసిన ఘటనతో సంబంధం ఉన్న ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పంజాబ్ సీఎస్ జతిందర్ సింగ్ తెలిపారు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న నిందితులను ఆపడానికి పోలీసులు కాల్పులు చేశారని.. ఈ ఘటనలో ఓ నిందితుడు గాయపడ్డాడని ఆయన వెల్లడించారు. నిందితులను పట్టుకోవడానికి ఆపరేషన్ కొనసాగుతోందని వివరించారు.

Here's Video 

కాగా, కోవిడ్‌-19 నియంత్రణకు మే 1 వరకు లాక్‌డౌన్‌ను (Punjab Lockdown) పొడిగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, దేశంలో లాక్‌డౌన్ పొడిగించిన రెండో రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. దీనిక‌న్నా ముందు ఒడిశా ప్ర‌భుత్వం ఏప్రిల్ నెలాఖ‌రు వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగించింది. ఇక పంజాబ్‌ 151 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా.. 11 మంది మరణించారు. ఐదుగురు కోలుకున్నారు.