Amaravati, April 12: ఏజెన్సీ ప్రాంతాల (Tribal areas) ప్రజలకు ఎప్పూడూ కష్టాలే. ఇప్పుడు తాజాగా కరోనా (Coronavirus) కష్టాలు ఎదుర్కుంటున్నారు. కనీసం మాస్కులు లేక ఆకులనే మాస్కులుగా (Tribes Corona Leaf Masks) తయారుచేసి కట్టుకుంటున్నారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో గిరిజనులు నివాసం ఉండే ప్రాంతాల కథ..
దేశంలో 8వేలు దాటిన కరోనావైరస్ కేసులు
ఏపీలో (Andhra Pradesh) అన్ని జిల్లాల్లో కేసులు నమోదవుతున్నా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో (Vizianagaram, Srikakulam) ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదంటే అక్కడి గిరిజన చైతన్యం ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వారు కరోనాని ఎలా తరిమేస్తున్నారో ఇట్టే తెలుసుకోవచ్చు.
జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఒడిశా రాష్ట్రానికి సమీపంలో ఉండే ఈ రెండు జిల్లాల అడవి బిడ్డలు కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి అడవిలో లభించే చెట్ల ఆకులనే మాస్కులుగా ధరిస్తున్నారు. కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్నందున మాస్కులు వాడాలని గ్రామ వలంటీర్లు తమకు చెప్పారని వీరంతా తెలిపారు. తమ వద్ద మాస్కులు లేకపోవడంతో అడవిలో లభ్యమయ్యే ఔషధ గుణాలున్న ఆకులు, నారలతో మాస్కులు తయారు చేసుకుని ధరిస్తున్నామని చెప్పారు. అలాగే గిరిజనులు తమకు తాముగా భౌతిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఏపీలో 405కు చేరిన కరోనా కేసులు
ఈ వైరస్ గురించి వారిని కదిలిస్తే వారు చెప్పే జవాబులు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. చదువుకున్న వారు ప్రభుత్వ రూల్స్ పాటించకుండా అడ్డదిడ్డంగా తిరుగుతుంటే వీరు మాత్రం ఆకులను మాస్కులుగా తయారుచేసుకుని ఇళ్లలో ఉంటున్నారు. బయటకు వస్తే అదేదో రోగం వస్తుంది కదా అని అంటున్నారు. పూట గడిస్తే పొట్ట గడవని ఈ ప్రాంత ప్రజలు కరోనాని తరిమేసేందుకు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా భౌతిక దూరాన్ని పాటిస్తున్నారు. ఈ గిరిజన చైతన్యానికి నిజంగా హ్యాట్సాప్ చెప్పాల్సిందే.
ఎక్కడి వారు అక్కడే, తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు
కాగా కరోనా వైరస్ వ్యాప్తి విశాఖ ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో లేదు. అయినా కరోనా నియంత్రణ చర్యలను అక్కడి గిరిజనులు చక్కగా పాటిస్తున్నారు. మైదాన ప్రాంతాలవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ పిలుపు మేరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మంచినీళ్ల కుళాయిల వద్దకు వచ్చినా, డీఆర్ డిపోల నుంచి నిత్యావసరాలు తీసుకునేందుకు వెళ్లినా కచ్చితంగా భౌతిక దూరం పాటిస్తున్నారు. మాస్కులు ధరిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో ఇప్పటివరకూ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదుకాకపోవడానికి గిరిజనుల చైతన్యమే కారణంగా చెప్పవచ్చు.
తెలంగాణలో విద్యార్థులకు పరీక్షలు ఉండవు, 1 నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు పాస్ లేకుండానే పై తరగతులకు
అయితే పట్టణాలు, గ్రామాల్లో మాస్క్ లు ధరించాలని అధికారులు చెబుతున్నారు కానీ.. ఏజన్సీలోని గిరిజనుల గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఏజెన్సీ ప్రజలు వాపోతున్నారు. కరోనా వస్తుందని మాస్కుల కోసం ఆరాట పడిన ఫలితం లేక పోయిందన్నారు. చేసేది లేక గిరిపుత్రులు తమకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని మాస్కులు తయారు చేసుకున్నారు. పెద్దవారికే కాకుండా చిన్నారులకు కూడా ఆకు మాస్కులను తయారు చేసి కట్టుకుంటున్నారు.
కరోనా దెబ్బ, జనావాసం వదిలి చెట్టుమీద నివాసం ఉంటున్న లాయర్
నాలుగు గంటలపాటు తాజాగా ఉండే ఈ ఆకుల మాస్కులు ధరించి గిరిజనులు రోజువారి పనులు చేసుకుంటున్నారు. బ్రేక్ డౌన్ తో వీరి జీవనం దీనంగా మారింది. వీరంతా అడవిలో దొరికే వస్తువులు సేకరించి వారాంతపు సంతలో అమ్ముకుని జీవనం సాగిస్తారు. కరోనా బ్రేక్ డౌన్ తో వారాంతపు సంతలు మూసివేయడంతో వీరి బతుకు దుర్భరంగా మారింది. వీరిలో చాలా మందికి రేషన్ కార్డులు లేకపోవడంతో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ , నగదు లభించడంలేదు.
ముంబై మురికివాడలో కరోనా కల్లోలం
అనాది నుండి వాళ్ళకు ఏదైనా ఆకులు అలములే. ఆకలైనా, చలిపెట్టినా, దేహాన్ని కప్పుకోవడానికైనా ఆకులూ అలములే వారికి జీవనాధారం. ఇప్పుడు మహమ్మారి కరోనా భయపెడుతున్న వేళ కూడా వారికి అవే జీవనాధారం అయ్యాయి. ప్రపంచమంతా ఎన్ 90 లు, ఎన్ 95 లు కట్టుకుంటుంటే వాళ్ళు ఆకులనే మాస్క్ లుగా చేసుకుని జీవిస్తున్నారు. కరోనా వైరస్ ని ఆకులతోనే తరిమికొట్టాలని చూస్తున్నారు. కరోనా మీద యుద్ధానికి కీ వాళ్ళకు ఆకులే ఆయుధాలుగా మారాయి.
న్యూయార్క్‌లో కుప్పలు కుప్పలుగా కరోనా శవాలు
చట్టాలు చేసే ప్రభుత్వం సామాన్య ప్రజల గురించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం పేదలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయాలని కోరుకుందాం,