Hyderabad, April 12: దేశంలో కరోనా (Coronavirus) విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగించేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ (Lockdown) పొడిగించాయి. ఇందులో భాగంగా తెలంగాణ కూడా లాక్ డౌన్ (Telangana Lockdown) ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. అయితే విద్యార్థుల విషయంలో ఇప్పుడు గందరగోళం నెలకొంది.
ఎక్కడి వారు అక్కడే, తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు
ఇప్పుడు పరీక్షల సీజన్ నడుస్తోంది. కరోనా వైరస్ కారణంగా గత కొన్ని రోజులుగా స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం పాఠశాలలు, కాలేజీలు, ఇతర ఇనిస్టిట్యూట్స్ మూసివేయాలని ఆదేశించారు. దీంతో కొన్ని రోజులుగా స్కూల్స్ తెరచుకోలేదు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి పరీక్షలు తెలంగాణాలో జరగలేదు.
కాగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందుతుండడంతో ప్రభుత్వం దానిపై ఎక్కువగా దృష్టి సారించింది.దీంతో విద్యార్థులు ఆందోళనలో పడిపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విద్యార్థుల విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు సీఎం కేసీఆర్ (K Chandrashekar Rao) తెరదించారు.
ఏపీలో 405కు చేరిన కరోనా కేసులు
విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనలపై చర్చించడం జరిగిందని వివరించారు. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు పరీక్షలు పాస్ లేకుండానే పై తరగతులకు పంపించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇతర రాష్ట్రాలు ఈ విధంగానే నిర్ణయం తీసుకున్నాయనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 10వ తరగతి పరీక్షల విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు.
దేశంలో 8వేలు దాటిన కరోనావైరస్ కేసులు
2020, ఏప్రిల్ 11వ తేదీ శనివారం ఉదయం ప్రధాన మంత్రి మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని లాక్ డౌన్ పొడిగింపుపై అభిప్రాయాలు తెలియచేశారు. అనంతరం సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరిగింది. 5 గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించి లాక్ డౌన్ పొడిగిస్తునట్లుగా తెలిపారు.