Coronavirus Outbreak: (Photo-IANS)

Amaravati, April 12: ఏపీలో కొత్తగా 24 కరోనా పాజిటివ్ కేసులు (Covid 19 pandemic in AP) నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 405కు చేరింది. తాజా కేసులు జిల్లాల వారీగా చూస్తే.. గుంటూరు జిల్లాలో 17, కర్నూలులో 5, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 11 మంది డిశ్చార్జ్ అయ్యారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 82 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్, రెడ్‌జోన్ల వరకు పరిమితం చేయాలన్న జగన్

మొత్తంగా గుంటూరు జిల్లాలో 75, నెల్లూరు 48, ప్రకాశం 41, కృష్ణా 35 కేసులు, కడప 30, పశ్చిమగోదావరి జిల్లా 22, విశాఖ 20, చిత్తూరు జిల్లాలో 20, తూర్పుగోదావరిజిల్లాలో 17, అనంతపురం జిల్లాలో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు కరోనా సోకి 6 గురు మృతి చెందారు.(అనంతపురం 2,కృష్ణ2, గుంటూరు 1, కర్నూల్ 1). కరోనా పాజిటివ్ (COVID-19) నుండి కోలుకుని 11 మంది డిశ్చార్జ్ కాగా...ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 388 మందికి చికిత్స పొందుతున్నారు.

ఏపీలో రెడ్ జోన్లుగా 133 ప్రాంతాలు

కరోనావైరస్ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని (Andhra Pradesh) గుంటూరు జిల్లాలో ఏప్రిల్12న పూర్తిగా కర్ఫ్యూ అమలు చేస్తామని కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ రాజ్ ప్రకటించారు. రాష్ట్రంలో కర్నూలు తర్వాత అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు గుంటూరు జిల్లాలో నమోదవుతున్నాయి.

Here's ArogyaAndhra Tweets

 

ఈ నేపధ్యంలో ఆదివారం నుంచి జిల్లాలో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయనున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి శనివారం సాయంత్రం వరకు జిల్లాలో 17 పాజిటివ్ కేసులు రావటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

నూతన ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌

జిల్లా వ్యాప్తంగా 12 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ మాత్రమే నిత్యావసరాల కొనుగోళ్లకు అనుమతిస్తామన్నారు. మెడికల్ షాపులు తప్ప ఇతర షాపులేవీ తెరిచి ఉండబోవని కలెక్టర్ తెలిపారు. హోం డెలివరీ సదుపాయాన్ని వాడుకోవాలని ప్రజలకు సూచించారు.

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కోవిడ్- 19 కేసులు

జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ మాస్కులు లేకుండా తిరగడాన్ని నిషేధించారు. ప్రజలు రోడ్లపైకి మాస్కు లేకుండా వస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని, పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. కరోనా వైరస్ లక్షణాలు ఉంటే 104 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫిర్యాదు చేయాలి..క్వారెంటైన్ లో ఉన్న వారికి 500 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. కాగా జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయినప్పటికీ, నానాటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.