COVID-19 'Treehouse': కరోనా దెబ్బ, జనావాసం వదిలి చెట్టుమీద నివాసం ఉంటున్న లాయర్, సామాజికి దూరాన్ని పాటించేందుకు ఇలా, ఉత్తరప్రదేశ్‌లో ఘటన
Hapur man builds 'treehouse' to maintain social distancing as COVID-19 spreads (Photo-ANI)

Lucknow, April 10: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో మనుషుల మధ్య భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఎవరికి తోచినట్టుగా వారు భౌతిక దూరం పాటిస్తున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు (Uttar pradesh) చెందిన అడ్వ‌కేటు ముఖుల్ త్యాగి.. సామాజిక దూరాన్ని పాటించేందుకు ఓ చెట్టుపై పాక్షిక నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. హ‌పూర్‌కు చెందిన అత‌ను అసురా అనే గ్రామంలో.. ఓ పెద్ద చెట్టుపై ఉన్న కొమ్మ‌ల న‌డుమ గూడు క‌ట్టుకున్నాడు. ముంబై మురికివాడలో కరోనా కల్లోలం

చె​ట్టునే నివాసంగా మార్చుకుని కాలం గడుపుతున్నారు. హాపూర్‌ (Hapur man) సమీంలోని అశోధ గ్రామంలో చెట్టుపై కట్టెలు, గడ్డితో మంచె నిర్మించుకుని నిచ్చెన సాయంతో దానిపైకి ఎక్కి పుస్తకాలు చదువుతూ, హాయిగా నిద్రపోతూ కాలం గడిపేస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటించేందుకు చెట్టునే ఇల్లుగా చేసుకుని (Coronavirus) జీవిస్తున్నానని ‘ఏఎన్‌ఐ’తో ముకుల్‌ త్యాగి చెప్పారు.

Here's ANI Tweet

తన కుమారుడి సహాయంతో చెట్టుపై మంచె నిర్మించానని వెల్లడించారు. ‘చెట్టుపై ఇల్లు కట్టుకోవాలని మా నాన్న ఆలోచించారు. ఎండిన చెట్ల కొమ్మలను సమానంగా నరికి వీటిని తాడు సహాయంతో సమాంతరంగా కట్టాము. దానిపై గడ్డివేసి మంచెలా తయారు చేశాం. చెట్టుపై కట్టడం గొప్ప అనుభూతి. ఇక్కడ ఉంటే ప్రకృతికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంతేకాదు ఎటువంటి కాలుష్యం లేకుండా హాయిగా ఉంటుంది. ఈ అనుభూతిని ఎంతో ఆస్వాదిస్తున్నాను’ అని త్యాగి కుమారుడు అన్నారు.

న్యూయార్క్‌లో కుప్పలు కుప్పలుగా కరోనా శవాలు

ఇంటి దగ్గర నుంచి ఇక్కడికే భోజనం తెప్పించుకుంటున్నానని ముకుల్‌ వెల్లడించారు. ఇదంతా చూసిన స్థానికులు ‘చరిత్ర పునరావృతం కావడం’ అంటే ఇదేనేమో అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు 410 మంది కోవిడ్‌ బారినపడ్డారు.

యూపీలో లాక్‌డౌన్ (Lockdown) వ‌ల్ల జీవ‌నోపాధి కోల్పోయిన భ‌వ‌న నిర్మాణ కార్మికులకు ప్ర‌భుత్వం వారి అకౌంట్ల‌లో వెయ్యి రూపాయలు వేస్తున్న‌ది. ఇక మిగితా కార్మికుల‌కు కూడా ఆ అమౌంట్‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌నున్న‌ట్లు సీఎం యోగి ఆదిత్య‌నాథ్ తెలిపారు. కోవిడ్‌19 (COVID-19) ప‌రీక్ష‌ల కోసం వ‌స‌తులు, చికిత్స‌కు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాల‌ని కాంగ్రెస్ నేత ప్రియాంకా వ‌ద్రా ఆ రాష్ట్ర సీఎంను ఓ లేఖ‌లో కోరారు.