
Mumbai, April 10: మహారాష్ట్రలో కరోనా (Maharashtra coronavirus) మహమ్మారి విజృంభిస్తోంది. అక్కడ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మందికి పాజిటివ్ రావడంతో క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. లాక్‌డౌన్‌ను (Lockdown) కఠినంగా అమలు చేస్తూ వ్యాప్తిని నిరోధించే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. కేసుల సంఖ్య రెట్టింపు అవుతుండడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
లాక్‌డౌన్‌తో పనేంటి, పీఎంసీ బ్యాంకు నిందితుల భారీ విందు
ఇక ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో (Mumbai Dharavi) ఇవాళ మరో కరోనా మరణం నమోదైంది. దీంతో ఇప్పటివరకు ధారావిలో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3కి చేరింది. ఇప్పటివరకు ధారావిలో 22 కరోనా కేసులు (Dharavi COVID-19 Repor) నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పుడు ఈ మురికివాడలో నివసించే లక్షల మంది ప్రాణభయంతో వణికిపోతున్నారు. రాబోయే 10-12రోజుల్లో దాదాపు 7.5లక్షల మంది ధారావి వాసులకు కరోనా టెస్ట్ లు చేయనున్నట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(BMC) తెలిపింది. ఇందుకోసం 150 మంది ప్రైవేట్ డాక్టర్ల సాయాన్ని కూడా బీఎంసీ తీసుకోనుంది.
దేశంలో కరోనా కలవరం, 12 గంటల్లో 547 కరోనా పాజిటివ్ కేసులు
ఇదిలా ఉంటే భారత్ లో ఎక్కువగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు మహారాష్ట్రలో మొత్తం 1364 కరోనా కేసులు నమోదుకాగా,97మరణాలు నమోదయ్యయి. దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల్లో సగం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 6412 కరోనా కేసులు (coronavirus positive cases) నమోదు కాగా,199మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లోనే 547 కొత్త కేసులు నమోదయ్యాయి.
ధారావీ మురికివాడలో కరోనా చికిత్సలో ఉన్నవారిసంఖ్య పెరుగుతుండటంతో బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించారు. ధారావీలో గుండె జబ్బులు, శ్వాసకోస సమస్యలు, రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలున్న వారికి కరోనా సోకే ప్రమాదం ఉన్నందున వారిని ఆరోగ్యశాఖ కార్యకర్తలు ఇంటింటి సర్వేతో గుర్తించారు. కరోనా చికిత్సలో ఉన్నవారి ఇళ్లకు మున్సిపల్ అధికారులు సీలు వేశారు. కరోనా లక్షణాలున్న వారిని ఆసుపత్రులకు తరలించి పరీక్షలు చేస్తున్నారు.