 
                                                                 Jaipur, June 24: రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ శుక్రవారం తమను తాము హిందువులుగా పరిగణించని వారు హిందువులో, కాదో తెలుసుకునేందుకు డీఎన్ఏ టెస్టు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్, దాని మిత్రపక్షమైన భారత్ ఆదివాసీ పార్టీ (బిఎపి), అనేక గిరిజన సంక్షేమ సంస్థల నుండి ఎదురుదెబ్బ తగిలింది.కాగా కోటాలోని మండి నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన భారతీయ ఆదివాసీ పార్టీ (బీఏపీ) సభ్యులు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
గిరిజనులు హిందువులు కాదంటూ బీఏపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి మాట్లాడుతూ.. ‘‘వారు హిందువులా? కాదా? అన్న విషయాన్ని వారి పూర్వీకులను అడిగి తెలుసుకుంటాం. వంశవృక్షం నమోదు చేసిన వారిని సంప్రదిస్తాం. ఒకవేళ వారు హిందువులు కాకపోతే వారు ఆ తల్లిదండ్రుల బిడ్డలేనా అని తెలుసుకునేందుకు డీఎన్ఏ పరీక్ష చేయిస్తాం’’ అని వ్యాఖ్యానించారు. అవి ముంబై అటల్ సేతు బ్రిడ్జి పగుళ్లు కాదు, కాంగ్రెస్ షేర్ చేసిన ఫోటోలపై స్పష్టతనిచ్చిన MMRDA అధికారి
మంత్రి వ్యాఖ్యలపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. బన్సవారా ఎంపీ రాజ్‌కుమార్ మాట్లాడుతూ డీఎన్ఏ పరీక్ష కోసం తమ రక్తం , గోళ్లు, వెంట్రుకల నమూనాలను మంత్రి దిలావర్, ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మకు పంపాలని గిరిజనులను కోరుతూ ప్రచారం ప్రారంభిస్తానని హెచ్చరించారు. గిరిజనులను మంత్రి అవమానించారని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
🫵 @madandilawar तुम क्या समझ रहे बिना माफी के निकल लोगे इस भ्रम में मत रहना
अभी भी वक्त है मदन दिलावर माफी मांग ले😠
अन्यथा क्या होगा अंदाजा भी नहीं लगा पाएगा।#मदन_दिलावर_माफी_मांगों #मदन_दिलावर_मुर्दाबाद pic.twitter.com/bvmkYODN06
— Sorabh INC 🇮🇳 (@SorabhInc) June 22, 2024
దిలావర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా విరుచుకుపడింది. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా మాట్లాడుతూ దిలావర్ మానసిక స్థిమితం కోల్పోయారని విమర్శించారు. మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రతాప్‌గఢ్‌లో ఆదివాసీ యువమోర్చా నిరసన ప్రదర్శన చేపట్టింది. మంత్రి దిష్టిబొమ్మలను దహనం చేసింది.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
