Lucknow, April 05:దేశ వ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus in India) పంజా విప్పిన నేపథ్యంలో దానిని అరికట్టేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఈ విపత్కర పరిస్థితుల్లో పోలీసుల పాత్ర ఎంతో గొప్పది. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశవ్యాప్తంగా పోలీసులు చేస్తున్న సేవలను (A day to salute police officers) ఎంత ప్రశంసించినా తక్కువే.
లాక్‌డౌన్ కాలంలో అంకితభావంతో సేవలందిస్తునందుకు కృతజ్ఞతగా పోలీసులకు పాదాభివందనం చేసిన ఎమ్మెల్యే
ఎందుకంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పోలీసులు తమ కుంటుంబాలను వదిలిపెట్టి ప్రజల శ్రేయస్సు కోసం రోడ్లపై నిద్రాహారాలు మానేసి..విధులు నిర్వర్తిస్తూ దేశసేవకు అంకితమవుతున్నారు. వారిపై ఏదో విధంగా తమ ప్రేమను ప్రజలు చాటుకుంటున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ లోని మీరట్ వాసులు (UP's Meerut Shower Flowers) పోలీసులపై తమ అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు.
యూపీ వాసులు (UP Police Officer's) ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రజలకు సేవలందిస్తోన్న పోలీసులను గొప్పగా సత్కరించారు. మీరట్ వాసులు వాహనాల్లో వస్తున్న పోలీసులపైకి పూల వర్షం కురిపించారు.
Here's Video
#WATCH Meerut: People shower flowers at police vehicles in the city as a mark of gratitude for police services during #CoronavirusPandemic. pic.twitter.com/7mee3fF77w
— ANI UP (@ANINewsUP) April 4, 2020
Meerut: People shower flowers at police vehicles in in the city as a mark of gratitude for police services during #CoronavirusPandemic. pic.twitter.com/1yB7UNO6Dz
— ANI UP (@ANINewsUP) April 4, 2020
పోలీసులు వస్తున్న దారి పొడవునా మీరట్ ప్రజలు పూలు జల్లుతూ..సమాజానికి పోలీసులు చేస్తోన్న సేవలను కొనియాడారు. పోలీసుల పట్ల మీరట్ వాసులు చూపిస్తున్న ప్రేమాభిమాలు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది.
వైరస్ వచ్చిన వ్యక్తుల పట్ల వివక్ష చూపకండి; ఏపీ సీఎం వైఎస్ జగన్
దేశ వ్యాప్తంగా మరణాలు 3374కి చేరుకున్నాయి. మరణించిన వారి సంఖ్య 77కి చేరింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాత్రి 9 గంటల 9 నిమిషాలకు లైట్లు ఆర్పివేసి కొవ్వుత్తులను కాని మొబైల్ ఫ్లాష్ లైట్లు కాని వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.