Car-Truck Collision: మంటల్లో ఏడుగురు సజీవ దహనం, గుజరాత్‌లో కారును ఢీకొట్టిన ట్రక్, సురేంద్రనగర్ జిల్లా కేంద్రం సమీపంలో విషాద ఘటన
వేగంగా వస్తున్న ట్రక్ కారును ఢీకొట్టడంతో (Car-Truck Collision) మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ఏడుగురు సజీవదహనం అయ్యారు. శనివారం ఉదయం సురేంద్రనగర్ జిల్లా కేంద్రం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Gandhinagar, Nov 21: గుజరాత్‌లోని పట్టి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం (road accident in Gujarat) చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ట్రక్ కారును ఢీకొట్టడంతో (Car-Truck Collision) మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ఏడుగురు సజీవదహనం అయ్యారు. శనివారం ఉదయం సురేంద్రనగర్ జిల్లా కేంద్రం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అతి వేగమే ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోకి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక ఎస్పీ హెచ్‌సీ దోషీ దర్యాప్తు చేస్తున్నారు. తాజా ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇంతటి ఘోర ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు. వేగంగా ఢీకొనడంతొ కారు నుజ్జు నుజ్జు అయింది. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న టిప్పర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు సురేంద్ర నగర్ డిప్యూటీ ఎస్పీ హెచ్‌పీ జోషి తెలిపారు.
Here's ANI Tweet
కాగా గుజరాత్‌లో గత మూడు రోజుల వ్యవధిలో ఇలాంటి ఘోర ప్రమాదం జరగడం ఇది రెండోసారి. బుధవారం వడోదరలో ఎదురెదురుగా వస్తున్న రెండు ట్రక్కులు ఢీకొని 11 మంది మరణించారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే వడోదర ప్రమాదాన్ని మరువకముందే ఇలాంటి మరో ఘోర ప్రమాదం సురేంద్రనగర్ జిల్లాలో జరగడంపై పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.