Kalaburagi Road Mishap: కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం, గర్భిణి సహా ఏడుగురు మృతి, ఆగి ఉన్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టడంతో ఘటన

రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రక్కును వేగంగా వస్తున్న కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున కర్ణాటకలోని కలబురగి జిల్లాలోని సవలగి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం (Road accident in K'taka disctrict) చోటుచేసుకుంది. ఆపి ఉన్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టడంతో గర్భిణీ స్త్రీ సహా ఏడుగురు మరణించారు.

Road accident (image use for representational)

Bangalore, Sep 27: కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం (Kalaburagi Road Mishap) చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రక్కును వేగంగా వస్తున్న కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున కర్ణాటకలోని కలబురగి జిల్లాలోని సవలగి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం (Road accident in K'taka disctrict) చోటుచేసుకుంది. ఆపి ఉన్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టడంతో గర్భిణీ స్త్రీ సహా ఏడుగురు మరణించారు.

మృతి చెందిన వారిని.. ఇర్ఫాన్‌ బేగం (25), రూబియా బేగం (50), అబెదాబీ బేగం (50), జయజునాబీ (60), మునీర్ (28), మహ్మద్ అలీ (28), షౌకత్ అలీ (29)గా గుర్తించారు. కాగా వీరందరూ అలండ్‌ తాలుకాలోని ఒకే గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. అందులోబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. గర్భిణిని ఆస్పత్రిలో చేర్పించడానికి వీరంతా కలబురగికి వస్తున్నట్లు తెలుస్తోంది.

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం, వలస కూలీల పైనుంచి దూసుకెళ్లిన గూడ్స్ రైలు, 16 మంది మృతి

పోస్టుమార్టం నిర్వహించిన తరువాత మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కలబురగి జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



సంబంధిత వార్తలు

Mumbai Boat Accident Update: ముంబై బోటు ప్రమాదం, గల్లంతైన వారి కోసం ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ఆసుపత్రిలో చేరిన 105 మందిలో 90 మంది డిశ్చార్జ్, ఇద్దరి పరిస్థితి విషమం

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

CM Siddaramaiah: అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే, వీడియోని షేర్ చేస్తూ మండిపడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif