Parliament Winter Session 2021: మళ్లీ వివాదంలో..మహిళా ఎంపీలతో శశిధరూర్ సెల్ఫీ, పని చేయడానికి లోక్‌సభ ఆసక్తికరమైన ప్రదేశం అంటూ ట్వీట్, మండిపడిన నెటిజన్లు, ట్విట్టర్ వేదికగా క్షమాపణ కోరిన కాంగ్రెస్ ఎంపీ
‘‘లోక్‌సభ పని చేయడానికి ఆసక్తికరమైన ప్రదేశం కాదని ఎవరు చెప్పారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament Winter Session 2021) ప్రారంభం సందర్భంగా సోమవారం ఉదయం కాంగ్రెస్ నేత శశి థరూర్ తన ట్విటర్‌లో మహిళా ఎంపీలతో కలిసి దిగిన ఓ ఫోటో షేర్ చేశారు. ‘‘లోక్‌సభ పని చేయడానికి ఆసక్తికరమైన ప్రదేశం కాదని ఎవరు చెప్పారు. ఈ రోజు ఉదయం నేను నా తోటి ఆరుగురు మహిళా ఎంపీలను కలిశాను’’ అనే క్యాప్షన్‌తో ఓ ఫోటోషేర్ చేశారు. ఈ ఫోటో విమర్శలు మూటగట్టుకుంటుంది. మహిళా ఎంపీలపై సెక్సియెస్ట్ కామెంట్స్ చేశారంటూ నెటిజన్లు ఆయనపై విమర్శలు చేస్తున్నారు.
బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న మీరు.. మీ తోటి మహిళా ఎంపీల గురించి ఇలాంటి సెక్సియెస్ట్ కామెంట్ చేయడం ఎంత వరకు సబబు అంటూ విరుచుకుపడుతున్నారు. సరదాకు చేసిన పని కాస్త ఇలా రివర్స్ కావడంతో శశి థరూర్ ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. సారీ చెప్తూ మరో ట్వీట్ చేశారు శశి థరూర్. ‘‘ఇలా అందరం కలిసి సెల్ఫీ దిగడం మాకు చాలా సంతోషం కలిగించింది. ఇదంతా స్నేహపూర్వక వాతావరణంలో చోటు చేసుకుంది. తొలి రోజు రాజ్యసభలో 12 మంది ఎంపీలు సస్పెండ్, అనుచితంగా ప్రవర్తించినందుకు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న స్పీకర్
అదే స్ఫూర్తితో వారు(మహిళా ఎంపీలు) ఈ ఫోటోను ట్వీట్ చేయమని కోరారు.. నేను చేశాను. కానీ ఈ ఫోటో వల్ల కొందరు బాధపడ్డట్లు తెలిసింది. అందుకు నేను క్షమాపణలు చెప్తున్నాను. కాకపోతే పనిచేసే చోట ఇలాంటి స్నేహపూర్వక ప్రదర్శనలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది’’ అంటూ మరో ట్వీట్ చేశారు శశి థరూర్.