Shraddha Murder Case: ప్రియురాలిని 35 ముక్కలుగా నరికిన కేసులో షాకింగ్ నిజాలు, ఫ్రిజ్‌లో ప్రియురాలిని శరీర భాగాలను పెట్టి మరొకరితో రాసలీలలు నడిపిన ప్రియుడు
ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్దా వాకర్ హత్య కేసులో (Shraddha Murder Case) కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియురాలు శ్రద్దా వాకర్‌ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పునావాలా ప్రియురాలు మృతదేహాన్ని ఫ్రిజ్ లో పెట్టి ఇంకో యువతితో సన్నిహితంగా ఉన్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.
New Delhi, Nov 15: ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్దా వాకర్ హత్య కేసులో (Shraddha Murder Case) కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియురాలు శ్రద్దా వాకర్‌ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పునావాలా ప్రియురాలు మృతదేహాన్ని ఫ్రిజ్ లో పెట్టి ఇంకో యువతితో సన్నిహితంగా ఉన్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. శ్రద్ధాను చంపిన 15, 20 రోజుల్లోనే అప్తాబ్ డేటింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసి (Aftab installed a dating app) యువతులకు గాలం వేసేవాడని పోలీసులు గుర్తించారు.
డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన పలువురు మహిళలను అతడు ఇంటికి తీసుకొచ్చినట్లు పోలీసుల తెలుస్తోంది. చెఫ్‌గా శిక్షణ పొందిన అఫ్తాబ్, శ్రద్ధా శరీరాన్ని ముక్కలుగా చేసే ముందు రక్తపు మరకలు ఎలా శుభ్రం చేయాలో గూగుల్ చూసి నేర్చుకున్నట్లు, శరీరాన్ని ముక్కలు చేయడం కోసం హ్యుమన్ అనాటమీని చదివినట్లు పేర్కొన్నారు. క్రైం థ్రిల్లర్స్, వెబ్ సిరీస్‌లు చూసే అలవాటున్న అఫ్తాబ్.. అమెరికన్ వెబ్ సిరీస్ ‘డెక్సటర్’ ద్వారా ప్రేరణ పొంది శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో భద్రపరిచాడని పోలీసులు వెల్లడించారు.
మృతదేహంతో ఇంట్లో దుర్వాసన రాకుండా ఉండేందుకు అగర్‌బత్తీలు వెలిగించడం, ఫ్రిజ్‌లో దాచిన ఆమె ముఖాన్ని (Shraddha’s body parts remained in fridge) అప్పుడప్పుడు తీసి చూసుకునేవాడు. త్వరగా చెడిపోతున్న శరీర భాగాలను ముందుగా పారేసేవాడు. అతడి స్నేహితులు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఇతరులు.. తరచుగా ఇంటికి వస్తున్నా…ఇంట్లో కొన్నాళ్ల నుంచి మృతదేహం విడిభాగాలు ఉన్న విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త వహించాడు.
శ్రద్ధా హత్య ఇతరులకు తెలియకుండా ఉండేందుకు ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను అఫ్తాబ్ ఉపయోగించేవాడు. దాని నుంచి తన స్నేహితులకు మెసెజ్ పంపి చూస్తూ ఉండేవాడు. అలాగే ఆమె క్రెడిట్ కార్డు బిల్లులు కూడా చెల్లించేవాడు. అయితే రెండు నెలలుగా శ్రద్ధా ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో అనుమానం వచ్చిన ఆమె స్నేహితులు యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. దీంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన ఆరు నెలలకు ఈ దారుణం బయటకు వచ్చింది. ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు శ్రద్ధాను హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తి కోసం గాలిస్తున్నారు.
దారుణ ఘటనను ఓ సారి పరిశీలిస్తే.. 24 ఏళ్ల శ్రద్ధాకు ఓ డేటింగ్ యాప్ ద్వారా అఫ్తాబ్‌తో పరిచయం ఏర్పడింది. దాదాపు మూడేళ్లు ఇద్దరూ కలిసి జీవించారు. అయితే వీరి ప్రేమకు యువతి తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో ఇద్దరు కలిసి ఈ ఏడాది ఏప్రిల్ లో ఢిల్లీకి మకాం మార్చారు. తనను పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ ప్రియుడిపై ఒత్తిడి తీసుకురావడంతో వీరి మధ్య తరుచూ గొడవలు జరిగాయి. ఈ క్రమంలో మే 18న మరోసారి ఇద్దిరి మధ్య గొడవ జరగడంతో శ్రద్ధను అత్యంత అమానుషంగా గొంతు కోసి చంపాడు. అనంతరం ఆమె శరీర భాగాలను 35 ముక్కలుగా కట్ చేసి పాడవకుండా ఉండేందుకు భారీ ఫ్రిజ్‌లో అమర్చాడు. తరువాత వాటిని ఒక్కొక్కొటిగా ఢిల్లీ నగరమంతా పారేశాడు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)