New Delhi, Nov 14: ఈ ఏడాది మేలో గొడవ తర్వాత తన లైవ్-ఇన్ భాగస్వామిని చంపి (Woman killed by live-in partner), ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి, వాటిని రిఫ్రిజిరేటర్‌లో నింపి, ఆ ముక్కలను నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడేసిన ఆరోపణలపై దక్షిణ ఢిల్లీలో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.ఈ విషయాన్ని సీనియర్ పోలీసు అధికారి సోమవారం చెప్పారు.
26 ఏళ్ల యువతి శ్రద్ధా, నెలల తరబడి తనతో టచ్‌లో ఉండటం లేదని ఆమె తండ్రి చేసిన మిస్సింగ్ ఫిర్యాదు మేరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.అఫ్తాబ్ పూనావల్లా అనే వ్యక్తిని అతని లివ్-ఇన్ భాగస్వామి గురించి ప్రశ్నించగా, అతను హత్య చేసినట్లు అంగీకరించాడని మరియు ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా (body cut into 35 pieces) నరికినట్లు చెప్పాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...అఫ్తాబ్ అమీన్ పూనావల్ల అనే యువకుడు 26 ఏళ్ల శ్రద్ధా అనే అమ్మాయితో సహజీనం చేస్తున్నాడు. శ్రద్ధా ముంబైలోని ఒక మల్టీనేషనల్ కంపెనీ కాల్ సెంటర్‌లో పనిచేస్తోంది. అక్కడే పూనావల్లతో పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం ఇద్దరూ డేటింగ్ చేసుకునేంత వరకు వచ్చింది.అయితే వీళ్లిద్దరి వ్యవహారం శ్రద్ధ వాళ్ల కుటుంబసభ్యులకు నచ్చలేదు. దీంతో వారు ఇంట్లోంచి పారిపోయి ఢిల్లీలోని మెహ్రౌలీలో ఒక ప్లాట్‌కి మకాం మార్చి అక్కడే కలిసి ఉంటున్నారు.
ఐతే గత కొద్దిరోజులుగా ఆమె నుంచి కుటుంబసభ్యులకు కాల్స్ రావడం లేదు.అలాగే ఆమె తన సోషల్ మీడియా ఖాతాలలో ఫోటోలు అప్‌లోడ్ చేయలేదని గమనించిన మహిళ కుటుంబం మెహ్రౌలీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.దీంతో అనుమానం వచ్చిన శ్రద్ధా తండ్రి వికాశ్ మదన్ ఢిల్లీ వచ్చి ఆమె గురించి వాకాబు చేస్తూ...ఆమె ఫ్లాట్ వద్దకు వచ్చి చూడగా తాళం వేసి ఉందని తెలిపారు. దీంతో మృతురాలి తండ్రి పోలీసులుకు తన కూతురు కనిపించడం లేదంటూ పూనావల్లపై ఫిర్యాదు చేశాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేయడం ప్రారంభించారు. పోలీసులు పూనావల్ల కోసం తీవ్రంగా గాలించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో అతను చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ అయ్యారు. విచారణలో పూనావ్లల...తనని శ్రద్ధ తరచూ పెళ్లిచేసుకోమని పోరు పెట్టేదని..ఈ విషయమై ఇద్దరు గొడవపడినట్లు తెలిపాడు.
ఐతే ఒకరోజు ఆ గొడవ తారస్థాయికి చేరుకోవడంతో తాను కోపంతో శ్రద్ధా గొంతుకోసి హతమార్చినట్లు తెలిపాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి ఒక ఫ్రిజ్ కొనుక్కుని మరీ భద్రపర్చినట్లు తెలిపాడు. ఆ తర్వాత ఆ ముక్కలను పడేసేందుకు రోజు తెల్లవారుజామున 2 గంటలకు వెళ్లి వేర్వేరు ప్రాంతాల్లోపడేసి వచ్చినట్లు చెప్పాడు. దీంతో ఈ కేసు మర్డర్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.