Madhya Pradesh: వర్షాలు పడాలని ఆరు మంది బాలికలను నగ్నంగా ఉరేగించారు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రం దమోహ్‌ జిల్లాలో దారుణం, ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌

ఆ రాష్ట్రంలో వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆరుగురు మైనర్‌ బాలికలతో నగ్నంగా (Six Minor girls stripped naked) ఊరేగింపు నిర్వహించారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం (Madhya Pradesh) దమోహ్‌ జిల్లాలో జబేరా పోలీసు స్టేషన్‌ పరిధిలోని బనియా గ్రామంలో ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది

Image used for representational purpose | (Photo Credits: IANS)

Bhopal, Sep 7: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలో వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆరుగురు మైనర్‌ బాలికలతో నగ్నంగా (Six Minor girls stripped naked) ఊరేగింపు నిర్వహించారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం (Madhya Pradesh) దమోహ్‌ జిల్లాలో జబేరా పోలీసు స్టేషన్‌ పరిధిలోని బనియా గ్రామంలో ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది. బుందే‌ల్‌‌ఖండ్‌ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామంలో చాలా ఏళ్లుగా వర్షాలు పడక కరువు తాండవిస్తోంది.

అయితే బాలికలతో నగ్నంగా ఊరేగింపు జరిపిస్తే వరుణ దేవుడు కరుణించి, వర్షాలు కురిపిస్తాడన్న అంధ విశ్వాసంతో (locals believe this will bring ample rainfall) గ్రామ పెద్దలు సభ్య సమాజం తలదించుకొనే దురాగతానికి ఒడిగట్టారు. వారితో భుజా‌లపై కాడిని మోయిస్తూ, దానికి చివర కప్ప‌లను కట్టి ఊరే‌గిం‌చారు. వారి వెనుక గ్రామా‌నికి చెందిన మహి‌ళలు నడుస్తూ వరుణ దేవుడి పాటలు పాడుతూ నడి‌చారు. దీనికి సంబంధించిన రెండు వీడియోలు తెరపైకి వచ్చాయి. జిల్లా కేంద్రానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ దారుణంపై తమకు సమాచారం అందిందని పోలీసులు చెప్పారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని, బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

వారం రోజుల పాటు భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ, తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్న అధికారులు

నగ్న ప్రదర్శనకు బాధిత బాలికల తల్లిదండ్రులు సైతం అంగీకరించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. వర్షాల కోసం కప్పను ఒక దుంగకు కట్టి, గ్రామంలో ఊరేగించడం చాలామందికి తెలిసిందే. బనియా గ్రామంలో బాలికలను నగ్నంగా మార్చి, వారితో కప్ప ఊరేగింపు నిర్వహించారని దమోహ్‌ జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ఉదంతంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని దమోహ్‌ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.



సంబంధిత వార్తలు