Chattisgarh Officer Drained Dam: డ్యామ్‌లో ఫోన్ పడిపోయిందని 21 లక్షల లీటర్ల నీటిని తోడించిన అధికారి, మూడు రోజల పాటూ మోటార్లతో నీరంతా ఖాళీ, చత్తీస్‌గఢ్‌లో అధికారి నిర్వాకం
తన స్మార్ట్‌ఫోన్ రిజర్వాయర్(Reservoir)లో పడిందని, ఆ ఫోన్‌ను తీసేందుకు సుమారు 21 లక్షల లీటర్ల నీటిని తోడించాడు. ఆ నీరు అంతా వృధాగా వెళ్లింది. కానీ ఆ ఫోన్ మాత్రం చిక్కలేదు. సోమవారం నుంచి గురువారం వరకు మూడు మోటార్ల ద్వారా ఆ డ్యామ్ నుంచి నీటిని తొలగించే ప్రయత్నం చేశాడు
New Raipur, May 26: చత్తీస్‌ఘడ్(Chhattisgarh)లో ఓ ప్రభుత్వ అధికారి మతిలేని చర్యకు పాల్పడ్డాడు. తన స్మార్ట్‌ఫోన్ రిజర్వాయర్(Reservoir)లో పడిందని, ఆ ఫోన్‌ను తీసేందుకు సుమారు 21 లక్షల లీటర్ల నీటిని తోడించాడు. ఆ నీరు అంతా వృధాగా వెళ్లింది. కానీ ఆ ఫోన్ మాత్రం చిక్కలేదు. సోమవారం నుంచి గురువారం వరకు మూడు మోటార్ల ద్వారా ఆ డ్యామ్ నుంచి నీటిని తొలగించే ప్రయత్నం చేశాడు. కంకేర్ జిల్లాలోని కొలిబెడా బ్లాక్‌లో ఉన్న ఖేర్‌కట్టా డ్యామ్‌కు (Kherkatta Dam) తన మిత్రులతో కలిసి ఫుడ్ ఆఫీసర్ రాజేశ్ విశ్వాస్ ఆదివారం పిక్నిక్ వెళ్లాడు. అయితే సెల్ఫీ దిగుతున్న సమయంలో తన చేతుల్లో ఉన్న స్మార్ట్‌ఫోన్ (Smart Phone) ఆ డ్యామ్‌లో పడింది. లక్ష ఖరీదైన ఆ ఫోన్‌లో ప్రభుత్వ డేటా ఉందని, ఆ ఫోన్ కోసం మొదట ఈతగాళ్లతో అన్వేషించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నంలో సక్సెస్ కాకపోవడంతో, నీటిని తోడేయాలని ట్రై చేశాడు.
15అడుగుల లోతైన ఆ డ్యామ్ నుంచి 30హెచ్‌పీ డీజిల్ పంపులతో వరుసగా మూడు రోజుల పాటు నీటిని తొడించేశాడు. అయితే ఆ మూడు రోజుల్లో 21 లక్షల లీటర్ల నీరు వృధాగా వెళ్లిపోయింది. ఆ నీటితో దాదాపు 1500 ఎకరాల్లో పంట పండుతుంది.
కొన్ని ఫీట్ల వరకు నీటిని తోడేస్తే, ఫోన్ దొరుకుతుందని స్థానికులు చెప్పారని, దీంతో నీటిపారుదల శాఖ అనుమతి తీసుకుని డ్యామ్ నుంచి నీటిని తోడేసేందుకు ప్లాన్ వేసినట్లు రాజేశ్ తెలిపాడు. నీళ్లలో పడిపోయిన ఫోన్ ప్రస్తుతం వర్కింగ్ కండీషన్‌లో లేదు. ఈ ఘటన గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాజేశ్‌ను సస్పెండ్ చేశాడు.