Smuggler Arrested in Pushpa 2 Theatre: పుష్ప -2 సినిమా చూస్తూ అడ్డంగా బుక్కయిన మోస్ట్ వాటెండ్ స్మగ్లర్, సినీ ఫక్కీలో థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు, ఆ తర్వాత ఏమైందంటే?
అయితే థియేటర్‌లోకి ప్రవేశించిన పోలీసులు అతడికి షాక్ ఇచ్చారు. వారి కళ్లగప్పి తప్పించుకుని తిరుగుతున్న ఆ నిందితుడ్ని అరెస్ట్ చేశారు. (Smuggler Caught During Pushpa 2 Screening) మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది.
Nagpur, DEC 22: డ్రగ్స్ స్మగ్లింగ్‌తోపాటు (Smuggling) రెండు హత్యా కేసుల్లో నిందితుడైన వ్యక్తి పుష్ప 2 సినిమా చూస్తూ ఆనందంలో మునిగిపోయాడు. అయితే థియేటర్‌లోకి ప్రవేశించిన పోలీసులు అతడికి షాక్ ఇచ్చారు. వారి కళ్లగప్పి తప్పించుకుని తిరుగుతున్న ఆ నిందితుడ్ని అరెస్ట్ చేశారు. (Smuggler Caught During Pushpa 2 Screening) మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. గ్యాంగ్‌స్టర్ విశాల్ మేష్రామ్‌పై 27 కేసులున్నాయి. ఇద్దర్ని హత్య చేయడంతోపాటు డ్రగ్స్ స్మగ్లింగ్‌కు (Drugs Smuggler) పాల్పడిన అతడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
అయితే గత పది నెలలుగా వారి కళ్లగప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. కాగా, విశాల్ ఇటీవల కొత్త కారు కొన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అతడి కదలికలపై నిఘా పెట్టారు. హీరో అల్లు అర్జున్ తాజా మూవీ ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa-2) సినిమా చూడటం పట్ల అతడు ఆసక్తి చూపుతున్నట్లు పసిగట్టారు. గురువారం అర్ధరాత్రి వేళ మల్టీప్లెక్స్‌లో ఆ సినిమా చూడటంలో నిమగ్నమైన విశాల్‌కు షాక్ ఇచ్చారు.
మరోవైపు థియేటర్‌కు చేరుకున్న పోలీసులు ముందు జాగ్రత్తగా కారు టైర్లలో గాలి తీసేశారు. ఆ తర్వాత సినిమా హాల్‌లోకి ప్రవేశించారు. పుష్ప సినిమా చూడటంలో బిజీగా ఉన్న విశాల్‌ను చుట్టుముట్టి అతడ్ని అరెస్ట్ చేశారు. మిగతా ప్రేక్షకులకు ఇబ్బంది కలుగకుండా వెంటనే అతడ్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. సినిమా సన్నివేశాన్ని తలపించేలా ఉన్న ఇది చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు.