SN Srivastava: ఢిల్లీకి కొత్త పోలీస్‌ కమిషనర్‌, అల్లరి మూకల పని పట్టనున్న ఎస్ఎన్ శ్రీవాస్తవ, పదవీ విరమణ చేయనున్న అమూల్య పట్నాయక్‌, ఢిల్లీలో పరిస్థితి అదుపులో ఉంది:హోంమంత్రి అమిత్ షా

ప్రస్తుత సీపీ అమూల్య పట్నాయక్‌ శనివారం పదవీవిరమణ చేయనున్నారు.కాగా ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణలను అదుపు చేయడంలో అమూల్య విఫలమయ్యారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో శాంతి భద్రతల విభాగం స్పెషల్ కమిషనర్‌గా వచ్చిన కొద్ది రోజులకే ఆయనను కమిషనర్‌గా నియమించడం గమనార్హం.

SN Srivastava (Photo Credits: IANS)

New Delhi, February 28: సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్ఎన్ శ్రీవాస్తవ ఢిల్లీ నూతన పోలీస్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుత సీపీ అమూల్య పట్నాయక్‌ శనివారం పదవీవిరమణ చేయనున్నారు.కాగా ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణలను అదుపు చేయడంలో అమూల్య విఫలమయ్యారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో శాంతి భద్రతల విభాగం స్పెషల్ కమిషనర్‌గా వచ్చిన కొద్ది రోజులకే ఆయనను కమిషనర్‌గా నియమించడం గమనార్హం.

బీజేపీ నేతలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు పిటిషన్

ప్రస్తుత కమిషనర్‌ అమూల్య పట్నాయక్‌ రేపు రిటైర్‌ కానుండడంతో ఆయన స్థానంలో శ్రీవాస్తవను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. శ్రీవాస్తవ 1985 బ్యాచ్‌కు చెందిన అరుణాచల్ ప్రదేశ్- గోవా- మిజోరాం- కేంద్ర పాలితప్రాంతం (ఏజీఎంయూటీ) కేడర్ అధికారి. ప్రభుత్వం ఆయనను సీఆర్పీఎఫ్ నుంచి ఢిల్లీ పోలీస్ విభాగంలోకి తీసుకొచ్చి స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా పోస్టింగ్ ఇచ్చింది.

ఢిల్లీలో స్పెషల్ సెల్ సహా పలు విభాగాలకు సేవలందించిన శ్రీవాస్తవ... ఇండియన్ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థపై దర్యాప్తులో కీలక పాత్ర పోషించారు. ట్రాఫిక్ విభాగంతో పాటు పలు జిల్లాల్లో కూడా ఆయన విజయవంతంగా సేవలందించారు. మరోవైపు ఢిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య 38కి చేరింది.

మా వాళ్లు ఉంటే రెండింతలు శిక్ష వేయండి

ఢిల్లీలో పరిస్థితి కుదుటపడుతోందని, అనవసర వదంతులను ఎవరూ నమ్మవద్దని దేశ ప్రజలను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. ఢిల్లీలో నేడు 10 గంటల పాటు కఠిన చట్టాల్ని అమలు చేస్తున్నట్లు.. ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గుంపులుగా ఉండరాదని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఎలాంటి భయం లేదన్న ఢిల్లీ పోలీస్‌ జాయింట్‌ కమిషనర్‌ ఓ పి శర్మ

ఈ అల్లర్లలో ఇప్పటికి 39 మంది మరణించారు. 45 మందిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు అయ్యాయి. ఈ అల్లర్లపై నమోదైన వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు పిటిషన్‌ను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కాగా, ఢిల్లీలో గడిచిన 36 గంటలుగా ఎలాంటి చేదు సంఘటనలు నమోదు కాలేదని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది.