Arvind Kejriwal. (Photo Credits: IANS)

New Delhi, February 27: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ఆప్ (Aam Aadmi Party) నేత తాహీర్ హుస్సేన్ పాత్ర ఉందన్న ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందించారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లలో (Delhi Violence) ఎవరి హస్తమున్నా వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. హింస, అల్లర్లను ఆధారంగా నడుస్తున్న రాజకీయాలకు స్వస్తి పలకాలని ఆయన ఆకాంక్షించారు.

ఢిల్లీలో హైటెన్సన్, 18 కేసులు నమోదు, 106 మంది అరెస్ట్

అల్లర్లలో ఏ రాజకీయ పార్టీ నేతలున్నా వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకవేళ ఆప్ నేత అల్లర్లలో ఉన్నట్లు తేలితే ఆయనకు రెండింతల శిక్ష వేయండని వ్యాఖ్యానించారు.

మరోవైపు అల్లర్ల కారణంగా దెబ్బతిన్న వారికి కేజ్రీవాల్ ప్రభుత్వం పరిహారం ప్రకటించడంతో పాటు బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ‘ఫరిస్తే’ పథకం (Farishte scheme) కింద బాధితులకు ఆహార పదార్థాలతో పాటు నిత్యావసర వస్తువులు కూడా ఇస్తామని ఆయన ప్రకటించారు. ఢిల్లీ అల్లర్లలో 35 మరణించగా, 200 మంది గాయపడ్డారని, వారందరికీ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యసాయం అందిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు.

Here's ANI Tweet

ఢిల్లీ అల్లర్లలో గాయపడిన వారికి ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఉచిత వైద్యంతో పాటు మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. దేశ భద్రతపై రాజీ పడకూడదు. నిందితులను కఠినంగా శిక్షించాలి. ఒకవేళ ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యక్తి అయితే రెట్టింపు శిక్ష ఉండాలని అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే ఈశాన్య ఢిల్లీలో 10,12వ తరగతికి సంబంధించి నెల 28, 29వ తేదీన జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్టు సీబీఎస్ఈ ప్రకటనలో తెలిపింది. కాగా అల్లర్లపై స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు కోరింది కేసు విచారణ ఏప్రిల్ 13వ తేదీకి విచారణ వాయిదా వేసింది. విద్యార్ధులు సురక్షితంగా స్కూల్స్ కు వెళ్లాలనే మంచి మనస్సుతో ఢిల్లీలోని యమునా విహాన్ వాసులు మానవ హారంగా నిలబడ్డారు.

అల్లర్ల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు ఫ్లాగ్‌ మార్చ్ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో పాఠశాలలు, షాపులు మూసివేశారు. అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 106 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు,18 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.