New Delhi, February 27: దేశ రాజధానిలో (Delhi) హైటెన్షన్ కొనసాగుతోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) వ్యతిరేకిస్తున్న, సమర్ధిస్తున్న వర్గాల మధ్య జరిగిన హింసాకాండలో మృతిచెందిన వారి సంఖ్య గురువారం నాటికి మరింత పెరిగింది.
అర్థరాత్రి విచారణ చేసిన న్యాయమూర్తి బదిలీ
కొద్దిరోజుల క్రితం జరిగిన ఘర్షణల్లో (Delhi Violence) తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఏడుగురు నేడు మరణించటంతో మృతుల సంఖ్య 33కు చేరింది. ఈ హింసాకాండలో దాదాపు 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ మేరకు సీనియర్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు విషయాన్ని ధ్రువీకరించారు.
వెంటనే కర్ఫ్యూ విధించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఢిల్లీ సీఏం
కాగా, రెండు రోజుల పాటు తీవ్ర ఘర్షణలతో అట్టుడికిపోయిన ఈశాన్య ఢిల్లీలో (North East Delhi) గొడవలు సద్దుమణిగాయి. పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉన్నప్పటికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. అల్లర్ల ప్రభావిత ప్రాంతాలైన చాంద్ భాగ్, భజన్‌పుర, కజురీ ఖాస్‌లలో గురువారం పారిశుద్ధ కార్యక్రమాలు మొదలయ్యాయి.
Here's ANI Tweet
Delhi: Death toll rises to 33 after another person passes away at Lok Nayak Jai Prakash Narayan (LNJP) hospital. #DelhiViolence pic.twitter.com/yvqVJ4PlKA
— ANI (@ANI) February 27, 2020
Dr Dilraj Kaur, Commissioner, East Delhi Municipal Corporation:We had a coordination meeting today. It's a coordinated team effort with Delhi Police. We'll be deploying our resources to clean up the areas. We'll try our best to bring it to normalcy at the earliest.#DelhiViolence pic.twitter.com/JwLi0H5ebY
— ANI (@ANI) February 27, 2020
అన్ని చోట్లా భద్రతా దళాలు మోహరించాయి. అయితే ఈ ఘర్షణల్లో బుల్లెట్ గాయాలు, కత్తులు, ఇతర ప్రాణాంతక ఆయుధాల కారణంగా అయిన గాయాల కన్నా.. తరుముకొస్తున్న దుండగుల బారి నుంచి తప్పించుకోవడం కోసం ఇళ్ల పై అంతస్తుల నుంచి దూకడం వల్ల చోటు చేసుకున్న గాయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న వైద్యులు వెల్లడించారు.
అనుకూల, వ్యతిరేక వర్గాల ఆందోళలన
ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ఎస్.ఎన్. శ్రీవాస్తవ (Delhi Special Commissioner of Police) పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. మేము కేసులను నమోదు చేస్తున్నాము మరియు చట్టపరమైన చర్యలతో ముందుకు వెళ్తున్నాము, త్వరలో మేము అరెస్టులు చేస్తాము. ఈ విషయాలన్నీ సాధారణ స్థితికి దోహదం చేస్తాయని మేము ఆశిస్తున్నామని ఆయన తెలిపారు.
Here's ANI Video
#WATCH Delhi Police Joint Commissioner OP Mishra during a flag march in Chand Bagh area announces, "Grocery, medical and other shops can be opened. There is nothing to fear, police are here for your security. Please don't assemble in groups, especially the youth". #DelhiViolence pic.twitter.com/nYhseSjf00
— ANI (@ANI) February 27, 2020
ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ ఓ పి శర్మ (Delhi Police Joint Commissioner OP Mishra) ఇవాళ చాంద్‌బాగ్‌లో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. ఎలాంటి భయం లేకుండా దుకాణ సమూదాయాలు తెరుచుకోండని అన్నారు.
సీఏఏ హింసపై మండిపడిన ఢిల్లీ హైకోర్టు
మీకు రక్షణగా మేమున్నామని తెలిపారు. ముఖ్యంగా మెడికల్ షాపులు, కిరాణం.. తదుపరి షాపులన్నీ తెరిచి ప్రజలకు సహకరించాలని ఆయన కోరారు. రోడ్లపై ఎవరూ గ్రూపులుగా ఉండకూడదనీ.. ముఖ్యంగా యువకులు బృందాలుగా ఏర్పడకూడదని ఈ సందర్భంగా తెలిపారు.
అర్థరాత్రి రంగంలోకి దిగిన అజిత్ డోవల్
ఆదివారం సాయంత్రం అల్లర్లు ప్రారంభం అయిన సంగతి విదితమే. తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన రెండు వర్గాలు.. స్థానికంగా ఉన్న షాపులు, ఇండ్లు, వాహనాలకు నిప్పుపెట్టారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. జఫ్రాబాద్, మౌజ్‌పుర్, బాబర్‌పుర్, యమునా విహార్, చాంద్ భాగ్, శివ్ విహార్ ప్రాంతాల్లో హింస హెచ్చు స్థాయిలో జరిగింది.
సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, అలీఘడ్‌లో ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేత
ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న రతన్ లాల్ ఆందోళనకారులు జరిపిన దాడిలో మృతి చెందారు. బుల్లెట్ గాయం వల్లే రతన్ లాల్ చనిపోయాడని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ప్రాణాలు కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.
ఉగ్రవాదుల ఇళ్లపై మూకుమ్మడి దాడులు
కుటుంబసభ్యులకు కోటి రూపాయలతో పాటు, రతన్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే రతన్ లాల్‌కు కేంద్రం అమరవీరుడి హోదా ఇచ్చింది. ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) పై అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ చనిపోయారు.
ఈశాన్య దిల్లీలో 'కనిపిస్తే కాల్చివేత' ఆదేశాలు
హింసాకాండ సాగిన జాఫ్రాబాద్ రోడ్డుపై ఉన్న కాంక్రీట్ డివైడర్ కంచెలను పగులగొట్టి వాటి రాడ్లు, రాళ్లను ఆయుధాలుగా చేసుకున్నారని తేలింది. ఈ దాడుల్లో కత్తులు, పెట్రోల్ బాంబులు, స్ర్కాప్ డీలర్ల వద్ద ఉన్న ఖాళీ సీసాలు, బీరు బాటిళ్లతో దాడులు చేశారని వెల్లడైంది.
ఈ ప్రాంతాల్లోని యువకులు నిరుద్యోగంతో చిన్న చిన్న నేరాలకు పాల్పడుతుంటారని, వారి ఇళ్లలో రాళ్లు, ఇటుకలు, ఖాళీ గాజు సీసాలను డాబాలపై నిల్వ చేశారని ఢిల్లీ మాజీ పోలీసు అధికారి ఎల్ఎన్ రావు చెప్పారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లపై 18 కేసులు నమోదు చేసి 106 మందిని అరెస్టు చేశారని, ఇందులో ఏఏ రకాల ఆయుధాలు వాడారనేది సమగ్ర దర్యాప్తు సాగిస్తున్నామని ఢిల్లీ పోలీసులు చెప్పారు.