Sonu Sood Supporting Swiggy Delivery Boy: దొంగ‌త‌నం చేసిన స్విగ్గీ డెల‌వ‌రీ బాయ్ కు మద్ద‌తుగా నిలిచిన సోనూసూద్, దొంగ‌కు స‌పోర్ట్ చేస్తున్నావంటూ ఫైర‌వుతున్న నెటిజ‌న్లు

అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకండి అంటూ ట్వీట్ చేశారు. సోనూసూద్ ట్వీట్ ప్రకారం.. ”స్విగ్గీ డెలివరీ బాయ్ ఒకరి ఇంట్లో ఫుడ్ డెలివరీ చేస్తున్నప్పుడు.. ఒక జత షూలు దొంగిలించినట్లయితే.. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు

Sonu-Sood-Supports-Swiggy-Delivery-Guy (PIC@ X)

Mumbai, April 13: నటుడు సోనూసూద్ తెలుగు వారందరికీ సుపరిచితమే. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తూ.. వారికి తనవంతు సహాయ సహకారాలను అందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన చేసే సేవాగుణంను చూసి చాలామంది అతన్నిఆరాధిస్తున్నారు. తాజాగా మరోసారి సోనూసూద్ (Sonu Sood) వార్తల్లో వ్యక్తిగా మారారు. ఈసారి షూలు దొంగిలించిన స్విగ్గీ డెలివరీ బాయ్ పట్ల సానుభూతిని చూపుతూ ట్వీట్ చేశారు. దీంతో సోనూసూద్ ట్వీట్ పట్ల పలువురు విమర్శలు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్ లో ఓ స్వీగ్గీ డెలివరీ బాయ్ (Swiggy Delivery Boy) ఆర్డర్ ఇచ్చి తిరిగి వస్తున్న సమయంలో ఇంటి గుమ్మం ముందు ఉన్న ఖరీదైన షూలను దొంగిలించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో పలువురు నెటిజన్లు డెలివరీ బాయ్ చేసిన పనిపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్విగ్గీ యాజమాన్యంకు సూచించారు.

 

ఓ నెటిజన్ స్పందిస్తూ .. కనీసం ఈ ఘటన పట్ల స్వీగ్గీ యాజమాన్యం స్పందించాలి. స్విగ్గీ బాయ్ దొంగిలించిన షూలు చాలా ఖరీదైనవిగా కనిపిస్తున్నాయి. వారికి డబ్బులు చెల్లించేలా బాధ్యత వహించాలని సూచించాడు. మరికొందరు నెటిజన్లు.. స్విగ్గీ బాయ్ పై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని యాజమాన్యంను డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో స్విగ్గీ బాయ్ చేసిన పనిపట్ల నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవేళ సోనూసూద్ షూలు దొంగిలించిన సిగ్వీబాయ్ కు మద్దతుగా నిలిచాడు (Sonu Sood Supporting Swiggy Delivery Boy). అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకండి అంటూ ట్వీట్ చేశారు.

 

సోనూసూద్ ట్వీట్ ప్రకారం.. ”స్విగ్గీ డెలివరీ బాయ్ ఒకరి ఇంట్లో ఫుడ్ డెలివరీ చేస్తున్నప్పుడు.. ఒక జత షూలు దొంగిలించినట్లయితే.. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. నిజానికి అతనికి కొత్త జత షూలు కొనండి. అతనికి నిజంగా అవసరం కావచ్చు.. అతనిపట్ల కాస్త దయగా ఉండండి’’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. సోనూసూద్ ట్వీట్ కు అయన అభిమానులు మద్దతు తెలుపుతుండగా.. కొందరు నెటిజన్లు సోనూసూద్ పట్ల విమర్శలు చేస్తున్నారు.

 

దొంగతనం చేసిన వ్యక్తిని ఎలా సమర్ధిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిపట్ల జాలిచూపండి.. కానీ, దొంగతనం చేసిన వ్యక్తిని ప్రోత్సహించేలా ప్రవర్తించకండి అంటూ ఓ నెటిజర్ సూచించారు.