Maharashtra Road Accident: తొమ్మిది మందిని బలిగొన్న అతివేగం, మహారాష్ట్రలో కారును ఢీకొన్న లారీ, పసికందు సహా 9 మంది దుర్మరణం
ఈ ప్రమాదంలో చిన్నారి సహా తొమ్మిది మంది దుర్మరణం చెందారు. గురువారం ఉదయం 5 గంటల సమయంలో రాయ్‌గడ్ జిల్లా రెపోలి వద్ద ముంబై-గోవా జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది మరణించారు.
Raigad, JAN 19: మహారాష్ట్రలోని (Maharashtra) రాయ్‌గడ్ జిల్లాలో (Raigad) ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా తొమ్మిది మంది (nine people died) దుర్మరణం చెందారు. గురువారం ఉదయం 5 గంటల సమయంలో రాయ్‌గడ్ జిల్లా రెపోలి వద్ద ముంబై-గోవా జాతీయ రహదారిపై (Goa-Mumbai highway) వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది మరణించారు. మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. ప్రమాదం ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు. గాయపడిన చిన్నారిని దవాఖానకు తరలించారు.
లారీ ముంబై (Mumbai) వైపు వెళ్తున్నదని, కారు గుహాగర్ వస్తున్నదని పోలీసులు తెలిపారు. మృతుల్లో చిన్నారితోపాటు ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారని చెప్పారు. ప్రమాదం నేపథ్యంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయిందని పోలీసులు తెలిపారు.