Delhi Excise Policy Scam Case: మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేం, ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

తన అరెస్ట్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) తిరస్కరించింది.

kejriwal(X)

New Delhi, August 14: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన అరెస్ట్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) తిరస్కరించింది. మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేమని (No Interim Bail) పేర్కొంది. ఈ మేరకు కేజ్రీవాల్‌ వేసిన పిటిషన్‌పై సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా సీబీఐ తనను అరెస్ట్‌ చేయడాన్ని దేశ అత్యున్నత న్యాయ స్థానంలో సవాల్‌ చేశారు.  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు దక్కని ఊరట, సీబీఐ కేసులో రెండు వారాల పాటు కస్టడీ పొడగింపు, మరిన్ని రోజులు జైల్లోనే ఢిల్లీ సీఎం

ఈ కేసులో కేజ్రీవాల్ రెగ్యులర్‌ బెయిల్‌ కోసం పిటిషన్‌ వేసినట్లు ఆప్‌ న్యాయ బృందం సోమవారం తెలిపింది. దీంతో పాటు గతంలో ఈ కేసులో ట్రయల్ కోర్టు తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై హైకోర్టు స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ మరో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుప్రీం కోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఇరువురి తరఫున వాదనలు విన్న ధర్మాసనం సీఎం కేజ్రీవాల్‌కు ఈ కేసులో మధ్యంతరం బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు కేజ్రీవాల్ పిటిషన్‌పై సమాధానాన్ని కోరుతూ సీబీఐకి నోటీసు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.

మద్యం కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ సీఎంని ఈడీ అరెస్ట్‌ చేసింది. అప్పటి నుంచి ఆయన తీహార్‌ జైల్లో ఉంటున్నారు. బెయిల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. ప్రస్తుతం సీబీఐ కేసులో తీహార్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. మరోవైపు కేజ్రీ జ్యుడీషియల్‌ కస్టడీని ఢిల్లీ కోర్టు సెప్టెంబర్‌ 2 వరకూ పొడిగించింది.



సంబంధిత వార్తలు

KTR: గుట్టలను మట్టి చేసి భూదాహం తీర్చుకోవడం కాదు..ధాన్యం రాశుల వైపు చూడాలని సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్, కాసుల కక్కుర్తి కాదు..రైతు బతుకు వైపు చూడాలని సవాల్

SC on Private Properties: ఆర్టికల్ 39(బి) ప్రకారం అన్ని ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు, ప్రైవేటు ఆస్తులపై ప్రభుత్వ హక్కుల అంశంపై సుప్రీంకోర్ట్ కీలక తీర్పు

Sea Plane in AP: విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్.. 9న విజయవాడ పున్నమిఘాట్‌ లో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

CM Revanth Reddy: యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాల్సిందే, వర్సిటీల్లో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని వీసీలను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి...తప్పు చేస్తే వీసీలపై చర్యలు తప్పవని హెచ్చరిక