Delhi, July 25: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ ఇప్పట్లో బయటకు వచ్చేలా కనిపించడం లేదు. లిక్కర్ స్కాం కేసులో ఈడీ కేసులో సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా సీబీఐ కేసులో మాత్రం రిలీఫ్ దక్కడం లేదు. ఇవాళ్టితో కేజ్రీవాల్ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు కేజ్రీవాల్. జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 8 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులో కేజ్రీవాల్ నుండి మరిన్ని వివరాలు రాబట్టాలని కస్టడీని పొడగించాలని కోరారు సీబీఐ అధికారులు. దీంతో కేజ్రీవాల్ కస్టడీని మరో రెండు వారాలు పొడగించింది. ఈ కేసులో జూన్ 26న కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్ జరిగిందనేది ఈడీ, సీబీఐ అధికారుల ప్రధాన ఆరోపణ. ఇదే కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులోనే ఉన్నారు. ఇక ED కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు ఇచ్చినా సీబీఐ కేసులో మాత్రం రిలీఫ్ దక్కలేదు.
కేజ్రీవాల్ ఆరోగ్యానికి హాని కలిగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ నేతలు ఆరోపించారు. కేజ్రీవాల్ ఆరోగ్యం ప్రమాదకరంగా ఉందని రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాయని తెలిపారు. ఇక దీనిపై బీజేపీ సైతం ఘాటుగానే స్పందించింది. సానుభూతి కోసం కేజ్రీవాల్ ఉద్దేశ్యపూర్వకంగా తక్కువ కేలరీల ఆహారాన్ని తీసుకుంటున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు. తెలంగాణ బడ్జెట్ హైలైట్స్,ఆరు గ్యారెంటీలకు ప్రాధాన్యత,వ్యవసాయానికి పెద్దపీట