SC on 2-Child Norm for Govt Jobs: ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు, రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు
రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇద్దరు పిల్లల అర్హత ప్రమాణాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది, ఇది వివక్షత కాదని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించదని ఓ కేసులో తీర్పు చెప్పింది
Supreme Court upholds Rajasthan’s 2-child norm for govt jobs: రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇద్దరు పిల్లల అర్హత ప్రమాణాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది, ఇది వివక్షత కాదని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించదని ఓ కేసులో తీర్పు చెప్పింది.రాజస్థాన్ (Rajasthan)లో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు.
కొన్నేళ్ల నుంచి రాష్ట్రంలో ఈ నిబంధన (2-child norm) అమల్లో ఉండగా.. తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court) దీన్ని సమర్థించింది. ఇందులో ఎలాంటి వివక్ష గానీ, రాజ్యాంగ ఉల్లంఘన గానీ లేదని తెలిపింది. ఈమేరకు దీన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. భార్య ఆత్మహత్యకు గల కారణాల్లో వేధింపులు మాత్రమే సరిపోవు, భార్యాభర్తల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కేసు ఏమిటంటే.. రాజస్థాన్‌కు చెందిన రామ్‌జీ లాల్ జాట్ గతంలో సైన్యంలో పనిచేసి 2017లో పదవీ విరమణ పొందారు. అనంతరం కానిస్టేబుల్ ఉద్యోగం కోసం 2018లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే, రామ్‌జీకి ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉండటంతో ఆయన దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
రాజస్థాన్ వివిధ సర్వీస్ (సవరణ) రూల్స్, 2001 ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగాలు కోరకుండా అడ్డుకుంటుంది.ఇద్దరు పిల్లల నిబంధనను సమర్థిస్తూ, 2017లో మిలటరీ నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత మే 25, 2018న రాజస్థాన్ పోలీస్‌లో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న మాజీ సైనికుడు రామ్‌జీ లాల్ జాట్ దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.