Surya Grahanam 2024: అక్టోబర్ 2న ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం...ఎన్ని గంటలకు ప్రారభం...ఎప్పుడు ముగుస్తుంది..ఎక్కడ చూడాలి...గ్రహణం వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది సూర్యగ్రహణం అక్టోబర్ రెండు న ఏర్పడనుంది. సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 2వ తేదీ రాత్రి 9 గంటలకు 13 నిమిషాలకు ప్రారంభమవుతుంది.

Solar Eclipse (Representational.. Credits: Google)

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది సూర్యగ్రహణం అక్టోబర్ రెండు న ఏర్పడనుంది.

సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 2వ తేదీ రాత్రి 9 గంటలకు 13 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అదే విధంగా ఉదయం 3 గంటల 17 నిమిషాల వరకు కొనసాగుతుంది. సంపూర్ణ సూర్యగ్రహణం మొత్తం 6 గంటల 4 నిమిషాల పాటు ఉంటుంది. అయితే ఇది రాఖీ కారణంగా భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించదు.

సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది

సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించక పోయిన ప్రపంచంలోని అనేక దేశాలలో ఇది కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ అమెరికా దక్షిణ అట్లాంటిక్, చిలి, అర్జెంటీనా మెక్సికో, బ్రెజిల్, న్యూజిలాండ్ వంటి ప్రాంతాలలో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది. రింగ్ ఆఫ్ ఫైర్ వలె ఇది కనిపిస్తుంది. అయితే గ్రహణాన్ని నేరుగా చూడడం కళ్ళకు అంత మంచిది కాదు. తీవ్ర నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్రహణాన్ని చూసేటప్పుడు మీరు బైనాక్యులర్లను, ఆప్టికల్స్, టెలిస్కోప్లను వాడడం మంచిది.

Astrology: అక్టోబర్ 13 శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం

గ్రహణం తర్వాత చేయవలసిన పనులు

సూర్యగ్రహణం పూర్తయిన వెంటనే స్నానం చేయాలి. దీనివల్ల గ్రహణ దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయని మన నమ్మకం మీ ఇంట్లో గంగాజలం ఉన్నట్లయితే వాటితో స్నానం చేస్తే మంచిది. లేనివారు కాస్త తులసాకులను వేసి స్నానం చేయాలి. తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి తీసుకొని గంగాజలాన్ని చల్లుకోవాలి.

కొన్ని సంవత్సరాల ప్రకారం గ్రహణం ముగిసిన వెంటనే దేవులపటాలను విగ్రహాలను గంగాజలంతో శుభ్రం చేయాలి. అలాగే విగ్రహాలను తాకడానికి ముందే మన శరీరం పైన కూడా గంగ జలాన్ని చల్లుకోవాలి గ్రహణం సమయంలో గరికను కూడా మన ఇంట్లో ఉన్న వస్తువుల పైన పెట్టాలి. అనంతరం పూజలు చేసుకోవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. 



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif