astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఇది అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. కొందరికి మంచి ఫలితాలను ఇంకొందరికి చెడు ఫలితాలను ఇస్తుంది. అక్టోబర్ 13న శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం. దీని కారణంగా సర్వార్ధ సిద్ధి రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం వల్ల మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి- శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం కారణంగా సర్వార్ధ సిద్ధిరాజయోగం ఏర్పడడం వల్ల ఈ రాశి వారికి అన్నీ అన్ని శుభ సమయాలు. ఉద్యోగ పరంగా అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. మీ ఆర్థిక పరిస్థితి ఇంతకుముందు కంటే మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనువైన సమయం వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేయాలని ఎప్పటినుంచి ఉన్న కళ నెరవేరుతుంది. విదేశాల్లో మీ వ్యాపార విస్తరణకు పెట్టుబడులు పెడతారు.

Astrology: సెప్టెంబర్ 30న శుక్రుడు కన్య రాశి నుండి తులా రాశిలోకి ప్రవేశం 

కన్యా రాశి- ఈ రాశి వారికి వీరి ఉద్యోగంలో పురోగతి ఉంటుంది ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా నలుదిక్కుల నుండి అవకాశాలు లభిస్తాయి. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాన్ని పొందుతారు. దీని ద్వారా మీ వ్యాపారంలో లాభాలు రెట్టింపు అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు దీనివల్ల విదేశాల్లో పై చదువులకు వెళతారు.

తులారాశి- సర్వార్థ సిద్ధి రాజయోగం వల్ల ఈ రాశి వారికి అనేక సానుకూల ప్రయోజనాలు కలుగుతాయి. అనేక మార్గాల నుండి ఆదాయ వనరులు వస్తాయి. ఎప్పటినుంచి ఇబ్బంది పెడుతున్న ఒక వ్యాధి నుండి బయటపడతారు. మీ ఉద్యోగం లో ప్రమోషన్ లభిస్తుంది. ప్రేమ వివాహాలకు అనుకూలం నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపార లో లాభాలు పెరుగుతాయి చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.