జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి శుక్ర గ్రహం వైభవం ఐశ్వర్యం ఆనందానికి అధిపతి అయితే సెప్టెంబర్ 30న శుక్ర గ్రహం వదిలి తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా అన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అత్యంత శుభకరం. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి- మేష రాశి వారికి శుక్రుడు రాశి మార్పు కారణంగా అనేకం సానుకూల ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా వీరికి ఆదాయం పెరుగుతుంది. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అప్పుల బాధ నుండి బయటపడతారు. మీ ఉద్యోగంలో జీతం పెరుగుతుంది. దీని ద్వారా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసేవారికి ఆకస్మిక ధన లాభం ఉంటుంది. మీరు పెట్టుబడులు పెట్టి మీ వ్యాపారాన్ని విస్తరిస్తారు. రిటైల్ వ్యాపారాలు వారికి మంచి లాభాలు ఉంటాయి. విద్యార్థులు చదువులో విజయాన్ని సాధిస్తారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్మితలు అవుతారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఉంటుంది. ప్రేమ వివాహాలకు అనుకూలం ఎప్పటినుంచ ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్య నుండి బయటపడతారు. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
వృశ్చిక రాశి- ఈ రాశి వారికి శుక్రుని రాశి మార్పు కారణంగా అనేక శుభ ఫలితాలు వస్తాయి. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండడం ద్వారా వీరి వ్యక్తిత్వం నలుగురిలో మెరుగుపడుతుంది . వీరు వ్యాపారాన్ని విస్తరించడానికి విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం దీని ద్వారా కొత్త ఆదాయ వనరులు వస్తాయి. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. కొత్త కస్టమర్లు వస్తారు ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. మీరు పని చేసే చోట సహోదయోగులతో మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉంటాయి. కుటుంబంలో గొడవలు తగ్గిపోతాయి. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.
Astrology: శనీశ్వరుడికి అత్యంత ఇష్టమైన 4 రాశులు ఇవే
ధనస్సు రాశి- ఈ రాశి వారికి ఎప్పటినుంచి ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్య నుండి బయటపడటం ద్వారా మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. దీని ద్వారా తల్లిదండ్రులకు ఆనందం పెరుగుతుంది. కోర్టు సమస్యల నుండి బయటపడతారు. పూర్వికులు నుండి రావాల్సిన ఆస్తి లభిస్తుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.