'Intense Lockdown': ఆ ఐదు నగరాల్లో పూర్తిగా లాక్‌డౌన్, కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు సర్కారు, మరింత కఠిన నిబంధనలతో లాక్‌డౌన్ అమలు

ఆదివారం నుంచి మరో ఐదు నగరాల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ (Tamil Nadu Intense Lockdown) అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి (CM E. Palaniswami) తెలిపారు. చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలం, తిరుప్పూర్‌లలో పూర్తిగా లాక్‌డౌన్ విధించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

Tamil Nadu Chief Minister Edappadi K Palaniswami (Photo Credits: ANI)

Chennai, April 25: కరోనా వైరస్ మరింత విస్తరించకుండా అడ్డుకట్ట వేసేందుకు తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి మరో ఐదు నగరాల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ (Tamil Nadu Intense Lockdown) అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి (CM E. Palaniswami) తెలిపారు. చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలం, తిరుప్పూర్‌లలో పూర్తిగా లాక్‌డౌన్ విధించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రధాని ‘దో గజ్ కి డూరి’ నినాదం, కరోనా మంచి గుణపాఠం నేర్పింది, పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా సర్పంచులతో ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌

చెన్నై, కోయింబత్తూరు, మదురైలను ఈ నెల 26 నుంచి 29 వరకు పూర్తిగా లాక్ డౌన్ చేయనున్నట్టు చెప్పారు. ఆ రోజుల్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందన్నారు. సేలం, తిరుప్పూర్‌లలో ఆదివారం నుంచి 28 వరకు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని వివరించారు.

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సడలింపులతో లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఐదు నగరాల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. చెన్నై, మదురై, కోయంబత్తూర్ నగరంలో నాలుగు రోజుల పాటు(ఏప్రిల్ 26 నుంచి ఏప్రిల్ 29 వరకు) ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ ప్రకటించారు. అదేవిధంగా సేలం, తిరుప్పూర్‌లో మూడు రోజుల పాటు(ఏప్రిల్ 26 నుంచి ఏప్రిల్ 28) వరకు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమల్లో ఉంటుందన్నారు. మెడికల్ సంబంధిత విషయాల్లో మాత్రం వెసులుబాటు కల్పించారు.  80 జిల్లాల్లో నో కేసులు, ఇండియాలో కరోనా రికవరీ శాతం 20.57, మొత్తం 23 వేలు దాటిన కరోనా కేసులు, వివరాలను వెల్లడించిన ఆరోగ్య శాఖ

ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ఉంటుంది. అయితే ప్రస్తుత ప్రకటనతో సంబంధిత ఐదు పట్టణాల్లో మరింత కఠిన నిబంధనలతో లాక్‌డౌన్ అమలు కానుంది. దీని ప్రకారం ఈ పట్టణాల్లో కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్లు అన్నీ బంద్ చేశారు. ప్రజలకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వ వర్గాలే మొబైల్ షాప్స్ ఏర్పాటు చేశారు. అయితే ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌కు అనుమతి ఇచ్చారు. ఇప్పటి వరకూ లాక్‌డౌన్ నిబంధనలను ప్రజలు ఎవరూ సరిగా పాటించలేదని, ఈ కారణంగా నిబంధనలను కఠినతరం చేయడం జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

2,400 కి పైగా కరోనావైరస్ కేసులతో తమిళనాడు భారతదేశంలో ప్రస్తుతం మూడవ స్థానంలోకి వచ్చింది. ఈ సంఖ్యలో 1,683 క్రియాశీల కేసులు ఉన్నాయి, 752 నయమైన కేసులు, ఇప్పటివరకు మరణించిన 20 మంది రోగులు ఉన్నారు. 17915 క్రియాశీల ఇన్ఫెక్షన్లు, 723 మరణాలతో సహా దేశవ్యాప్తంగా శుక్రవారం 23,452 కి కరోనా కేసులు చేరుకున్నాయి.