NEET Exam Scrapped In Tamil Nadu: నీట్ వ్యతిరేక బిల్లుకు ఆమోదం తెలిపిన తమిళనాడు అసెంబ్లీ, భారతీయ జనతా పార్టీ మినహా అన్ని పార్టీలు బిల్లుకు మద్దతు

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) నుంచి తమిళనాడు విద్యార్థులకు ఉపశమనం ఇవ్వాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీలో సోమవారం నీట్ వ్యతిరేక బిల్లును (Neet Exam Scrapped In Tamil Nadu) ఆమోదించారు.

Tamil Nadu Assembly Passes Bill to Scrap NEET Exam (Photo-ANI)

Chennai, Sep 13: నీట్ పరీక్షపై తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) నుంచి తమిళనాడు విద్యార్థులకు ఉపశమనం ఇవ్వాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీలో సోమవారం నీట్ వ్యతిరేక బిల్లును (Neet Exam Scrapped In Tamil Nadu) ఆమోదించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రవేశ పెట్టిన ఈ బిల్లుకు ఒక్క భారతీయ జనతా పార్టీ మినహా అన్ని పార్టీలు ఆమోదం (Tamil Nadu Assembly Passes Bill to Scrap NEET Exam) తెలిపాయి. రాష్ట్రంలోని సేలం జిల్లాలో నీట్ పరీక్షకు ముందు 20 ఏళ్ల ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అనంతరం దీనిపై తమిళనాడు ప్రభుత్వం బిల్లు రూపొందించింది.

బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ ‘‘మీరు (ఏఐడీఎంకే) కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉన్నారు. ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. సీఏఏ, వ్యవసాయ చట్టాల విషయంలో మీరు ఏమీ చేయలేదు. నీట్ విషయంలో అయినా కొన్ని షరతులు పెట్టి ఉండాల్సింది. కానీ మీకు గొంతులు పెంచేంత ధైర్యం లేదు. ఆశావాహులు చనిపోతుంటే మీరు మౌనంగా ఉన్నారు’’ అని అన్నాడీఎంకే నేతలను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. నీట్‌ను రద్దు చేయడానికి ప్రభుత్వం దశల వారీగా కృషి చేస్తుందని స్టాలిన్ అన్నారు.