Tamil Nadu: అది చేసుకుందామంటూ మగాడిని చీకట్లోకి తీసుకెళ్లిన హిజ్రా, అక్కడ మరో నలుగురు హిజ్రాలతో కలిసి ఆ వ్యక్తిని దారుణంగా చంపేసింది, నిందితులంతా అరెస్ట్

రాష్ట్రంలోని పుదుకొట్టై జిల్లాలో ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని 5 గురు హిజ్రాలు దారుణంగా హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు హిజ్రాలను పోలీసులు అరెస్టు ( Five transpersons arrested) చేశారు.

Hijras / For representational purposes (Photo | PTI)

Chennai, July 13: తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని పుదుకొట్టై జిల్లాలో ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని 5 గురు హిజ్రాలు దారుణంగా హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు హిజ్రాలను పోలీసులు అరెస్టు ( Five transpersons arrested) చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుదుకొట్టై జిల్లా పొన్‌అమరావతి ఆలవాయిల్‌ ప్రాంతానికి చెందిన ధర్మలింగం (45) తుడియలూర్‌ బస్‌స్టాప్‌ సమీపంలోని ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పని చేస్తున్నాడు.

ఈ ణెల 8వ తేదీ తీవ్రగాయాలతో కోవై ప్రభుత్వాస్పత్రిలో చేరాడు. తొమ్మిదో తేదీ రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందంటూ ధర్మలింగం తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టులో చొక్కలింగం కడుపుపై దాడిచేయడంతో మృతి (hotel worker’s murder in Coimbatore) చెందినట్లు తేలింది. దీంతో పెరియనాయకన్‌ పాలయం డీఎస్పీ రాజపాండియన్‌ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో హిజ్రాలు అతనిపై దాడి చేసి హత్య చేసినట్లు గుర్తించారు.

రేపిస్టులు జీవితాంతం సెక్స్‌కు పనికి రాకుండా కెమికల్‌ కాస్ట్రేషన్‌, కీలక బిల్లుకు ఆమోదం తెలిపిన థాయ్‌లాండ్‌ పార్లమెంట్, అసలు కెమికల్‌ కాస్ట్రేషన్‌ అంటే ఏమిటి..ఓ సారి చూద్దాం

ఈ సంఘటన జరిగిన రోజున రాత్రి తుడియలూర్‌ సమీపంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న హిజ్రాల్లో ఒకరు ధర్మలింగంను పని చేసుకుందామంటూ చీకటి ప్రదేశానికి తీసుకెళ్లింది. అక్కడ వాగ్వాదం జరగడంతో మరో నలుగురు హిజ్రాలు అక్కడికి చేరుకుని అతనిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ధర్మలింగం చికి త్స పొందుతూ మృతిచెందాడు. దీనిపై హత్య కేసు నమోదు చేసి పోలీసులు.. గౌండంపాళ్యం మారియమ్మన్‌ ఆలయ వీధికి చెందిన హిజ్రాలు రషి్మక (26), అరునిక (24), గౌతమి (20), రూబి (26), మమత (22)ను అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.



సంబంధిత వార్తలు

Cyclone Fengal: ఏపీకి ఫెంగల్ తుఫాను ముప్పు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, తీరం వెంబడి గంటకు 75 కిలో మీటర్ల వేగంతో గాలులు, నేడు తమిళనాడును తాకనున్న సైక్లోన్

Cyclone Fengal: తమిళనాడు వైపు దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాను, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన స్టాలిన్ సర్కారు, పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ

Maoists Killed Two Men: ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టుల దుశ్చర్య.. ఇన్‌ ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య.. మృతుల్లో పంచాయతీ కార్యదర్శి కూడా

Telangana HC Cancels GO No 16: కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు, ఇక నుంచి భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్ట ప్రకారం చేయాలని ఆదేశాలు