Tamil Nadu: చిట్టి జంతువులపై స్మగ్లర్ల కన్ను, స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులకు పట్టుబడిన ప్రయాణికుడు, బ్యాంకాక్ నుంచి చెన్నైకు స్మగ్లింగ్, ముద్దొచ్చే ఆ చిట్టి జంతువులను తిరిగి బ్యాంకాక్‌కు పంపించిన ఇంటలిజెంట్ ఆఫీసర్లు

చూడగానే ముద్దొచ్చేలా ఉన్న చిన్న జంతువులను స్మగ్లింగ్ చేస్తూ తమిళనాడులో (Tamil Nadu) ఓ స్మగ్లర్ ఇంటలిజెంట్ ఆఫీసర్లకు దొరికిపోయాడు. బ్యాంకాక్ నుంచి వచ్చి చెన్నైలో దిగిన భారత్ కు చెందిన ఓ ప్రయాణీకుడు ఈ అరుదైన జంతువులను బ్యాగులో పెట్టుకుని చెన్నై ఎయిర్‌పోర్టులో (Chennai airport) కనిపించాడు. అతను ఎయిర్ పోర్టులో అనుమానాస్పదంగా కనిపించడంతో ఇంటలిజెన్స్ అధికారులు అతడిని తనిఖీ చేశారు.

Kangaroo rats, prairie dogs and other exotic species seized from passenger at Chennai airport (Photo-ANI)

Chennai, December 23: చూడగానే ముద్దొచ్చేలా ఉన్న చిన్న జంతువులను స్మగ్లింగ్ చేస్తూ తమిళనాడులో (Tamil Nadu) ఓ స్మగ్లర్ ఇంటలిజెంట్ ఆఫీసర్లకు దొరికిపోయాడు. బ్యాంకాక్ నుంచి వచ్చి చెన్నైలో దిగిన భారత్ కు చెందిన ఓ ప్రయాణీకుడు ఈ అరుదైన జంతువులను బ్యాగులో పెట్టుకుని చెన్నై ఎయిర్‌పోర్టులో (Chennai airport) కనిపించాడు. అతను ఎయిర్ పోర్టులో అనుమానాస్పదంగా కనిపించడంతో ఇంటలిజెన్స్ అధికారులు అతడిని తనిఖీ చేశారు.

ఆ ప్రయాణికుడి లగేజీలో కొన్ని బుట్టల్లో వివిధ జంతుజాతుల పిల్లలు ఉన్నాయి. అందులో వింతగా ఉన్న 12 కంగారూ పిల్లలు, 3 ప్రైరీ డాగ్స్,(Kangaroo rats, prairie dogs) 1 ఎర్రని ఉడత పిల్ల, 5 అరుదైన జాతులకు చెందిన పిల్లలున్నాయి. అధికారులు వాటిని సీజ్ చేసి, తిరిగి వాటిని బ్యాంకాక్ పంపించారు.

ANI Tweet

కాగా అవి చాలా విలువైన జాతికి చెందినవిగా కనిపిస్తున్నాయి. చూడగానే చాలా ముద్దొచ్చేలా ఉన్నాయి. మరి ఆ జంతువులను ఎందుకు స్మగ్లింగ్ చేస్తున్నారనే దానిపై ఇంకా సమాచారం అందలేదు. అవి బ్యాంకాక్ లో ఎక్కడ నుంచి తీసుకువచ్చారనే దానిపై సరైన సమాచారం లేదు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement