NIA Raids in Tamil Nadu: గుడిలో సిలిండర్ పేలిన ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తు, తమిళనాడువ్యాప్తంగా ఎన్‌ఐఏ విస్తృత తనిఖీలు, కోయంబత్తూరు సహా 45 ప్రాంతాల్లో మెరుపు దాడులు చేసిన ఎన్‌ఐఏ, సిలిండర్ బ్లాస్ట్ ఘటనలో ఉగ్రకోణం ఉందనే అనుమానాలు, ఇప్పటికే అదుపులో ఐదుగురు యువకులు
ఈ పేలుడులో ఉగ్రకోణం ఉందని పోలీసులు నిర్ధారించారు. దీంతో అదేనెల 27న రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఎన్‌ఐఏకి అప్పగించింది. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు యువకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Coimbatore, NOV 10: కోయంబత్తూరు సిలిండర్ బ్లాస్ట్ కేసులో (Coimbatore LPG cylinder explosion) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బుధవారం అర్ధరాత్రి నుంచి తమిళనాడులోని (Tamil Nadu ) 45 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నది. అనుమానితులు, వారికి సంహకరించిన వారి ఇండ్లలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు (NIA raids) నిర్వహిస్తున్నారు. చెన్నైలోని పుడుపెట్, మన్నాడి, జమాలియా, పెరంబూరుతోపాటు కోయంబత్తూరు, కొట్టయ్‌మేడు, ఉక్కడం, పొన్విఝా నగర్, రతినపురి తదితర ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
దీపావళికి ఒకరోజు ముందు అంటే అక్టోబర్ 23న ఉదయం 4.30 గంటల సమయంలో తమిళనాడు కోయంబత్తూరులోని కొట్టే సంగమేశ్వర ఆలయం ముందు మారుతి కారులో ఉన్న సిలిండర్ పేలిపోయింది (cylinder explosion). ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
అయితే పేలుడు సంభవించిన ప్రాంతంలో బేరింగ్ బాల్స్, గాజుపెంకులు, అల్యూమినియం మేకులు కనిపించండంతో అనుమానాలకు తావిచ్చింది. ఈ పేలుడులో ఉగ్రకోణం ఉందని పోలీసులు నిర్ధారించారు. దీంతో అదేనెల 27న రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఎన్‌ఐఏకి అప్పగించింది. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు యువకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.