Tamil Nadu Shocker: విద్యార్థులు కాదు కామాంధులు, బ‌ర్త్‌డే పార్టీకి పిలిచి బాలికపై గ్యాంగ్ రేప్, ఆ దారుణాన్ని వీడియో తీసి మిగతా విద్యార్థులకు పంపిన వైనం, నిందితులు అరెస్ట్

స్కూల్లో చదువుతున్న బాలిక‌ను బ‌ర్త్‌డే పార్టీకి ఆహ్వానించి ఆపై ముగ్గురు సహ‌ విద్యార్ధులు ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి (15-Year-Old Girl Gangraped) పాల్ప‌డ్డారు.

Rape image (Pic Credit- PTI)

Chennai, July 8: తమిళనాడులో దారుణం (Tamil Nadu Shocker) చోటు చేసుకుంది. స్కూల్లో చదువుతున్న బాలిక‌ను బ‌ర్త్‌డే పార్టీకి ఆహ్వానించి ఆపై ముగ్గురు సహ‌ విద్యార్ధులు ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి (15-Year-Old Girl Gangraped) పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని క‌డ‌లూర్ జిల్లాలో క‌ల‌కలం రేపింది. ఈ దారుణ ఘ‌ట‌న‌లో ముగ్గురు నిందితుల‌పై పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

క‌డ‌లూర్ జిల్లా పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దువుతున్న బాలిక (15)ను అదే స్కూల్‌లో పదో త‌ర‌గ‌తి చ‌దివే విద్యార్ధి తన పుట్టిన రోజు పార్టీకి (Birthday Party in Cuddalore) ఆహ్వానించారు. పార్టీకి వ‌చ్చిన బాలిక‌ను ఏదో మాట్లాడాలంటూ ప‌దో త‌ర‌గ‌తి చ‌దివే విద్యార్ధి వేరే గ‌దిలోకి తీసుకువెళ్లాడు. ఆ గ‌దిలోకి మ‌రో ఇద్ద‌రు స్నేహితుల‌ను పిలిచి ఆపై గ‌ది త‌లుపులు మూసివేసి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

ప్రియుడుతో రూంలో భార్యను చూసిన భర్త, వ్యవహారం తెలిసిందనే కోపంతో ప్రియుడితో కలిసి భర్తను చంపేసి ఇంట్లోనే పూడ్చి పెట్టిన భార్య, తెలంగాణలో దారుణ ఘటన

ఈ బాలిక‌పై జరిగిన దారుణాన్ని వీరు వీడియోలో రికార్డు చేశారు. అదే స్కూల్‌కు చెందిన విద్యార్ధుల‌కు ఆ వీడియోను చేర‌వేశారు. ఘ‌ట‌న అనంత‌రం బాలిక స్కూల్‌కు వెళ్లేందుకు నిరాక‌రించ‌డంతో ప్ర‌శ్నించిన త‌ల్లికి జ‌రిగిన విష‌యం చెప్ప‌డంతో ఈ దారుణం వెలుగుచూసింది. కుటుంబ స‌భ్యుల‌తో కలిసి బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif