Telangana Shocker: ప్రియుడుతో రూంలో భార్యను చూసిన భర్త, వ్యవహారం తెలిసిందనే కోపంతో ప్రియుడితో కలిసి భర్తను చంపేసి ఇంట్లోనే పూడ్చి పెట్టిన భార్య, తెలంగాణలో దారుణ ఘటన
Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Hyd, July 8: తెలంగాణ రాష్ట్రంలో దారుణం (Telangana Shocker) చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం మోజులో తన భర్తను హతమార్చింది ఓ కసాయి భార్య. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని బందెంపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రమేశ్‌(26)కు వికారాబాద్‌ జిల్లా బషీ రాబాద్‌ మండలంలోని నీలపల్లి గ్రామానికి చెందిన వెన్నెలతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరు నాలుగేళ్ల క్రితం పటాన్‌చెరు ప్రాంతంలోని లింగంపల్లి శివారుకు కూలీలుగా వలసవచ్చారు.

అక్కడ దౌల్తాబాద్‌ మండలం భూమిడాల గ్రామానికి చెందిన గంగపురి దస్తప్పతో వెన్నెలకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతో వారు స్వగ్రామానికి తిరిగివెళ్లారు. రమేశ్‌ కుటుంబ సభ్యులకు వెన్నెల వివాహేతర సంబంధం గురించి తెలియడంతో ఇద్దరికీ సర్దిచెప్పారు.

ఓటీపీ చెప్పలేదని క్యాబ్ డ్రైవర్ ఘాతుకం, భార్యా పిల్లలు ముందే ప్రయాణికున్ని కొట్టి చంపేశాడు, తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన

అనంతరం వారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో ఓ ఇంటి నిర్మాణానికి కూలీలుగా వచ్చి పనులు చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నారు. ఇదే సమయంలో వెన్నెల ఎల్లారెడ్డిలో ఉంటున్నట్లు తెలుసుకున్న ఆమె ప్రియుడు రెండుమూడుసార్లు వచ్చి కలిశాడు.గతనెల 30న రాత్రి 11 గంటల సమయంలో అతడు రమేశ్‌ కంటపడ్డాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలోనే దస్తప్ప.. రమేష్ గొంతు నులమగా భార్య వెన్నెల కాళ్లు పట్టుకుని హత్యకు (Wife Kills Husband ) సహకరించింది.

అనంతరం మృతదేహాన్ని వారు పనిచేస్తున్న ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టారు. వెన్నెల మరుసటి రోజు రమేశ్‌ అన్న వెంకటప్పకు ఫోన్‌ చేసి తన భర్త ఎవరో బంధువులు మృతి చెందారని చెప్పి కర్ణాటకకు వచ్చాడని చెప్పింది. అనంతరం మూడు రోజుల క్రితం అత్తగారింటికి వెళ్లింది. అనుమానించిన రమేశ్‌ కుటుంబ సభ్యులు గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో మృతుడి అన్న వెంకటప్ప గురువారం ఎల్లారెడ్డి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు.

డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాస్, ఎస్సై గణేశ్‌ సంఘటన స్థలానికి చేరుకుని తహసీల్దార్‌ మునీరుద్దీన్‌ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహం కుళ్లిపోవడంతో వైద్యులు సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి, మృతుడి బంధువులకు అప్పగించారు. రమేశ్‌ను హతమార్చిన వెన్నెల, దస్తప్పలకోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.