Tamil Nadu Shocker: కదులుతున్న కారులోనే యువతిపై తెగబడిన కామాంధులు, మత్తుమందు ఇచ్చి 5 మంది సామూహిక అత్యాచారం, చెన్నైలో దారుణ ఘటన, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

కదులుతున్న కారులోనే కామాంధులు ఓ యువతిపై అత్యాచారానికి (20-Year-Old Woman Gangraped Inside Car) ఒడిగట్టారు. 20 ఏళ్ల యువతిపై అయిదుగురు కామాంధులు కలసి కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం చేసిన ఘటన తమిళనాడులో రెండు రోజుల క్రితం సంచలనం చేసుకుంది.

Image used for representational purpose | (Photo Credits: File Image)

Kanchipuram, September 12: తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న కారులోనే కామాంధులు ఓ యువతిపై అత్యాచారానికి (20-Year-Old Woman Gangraped Inside Car) ఒడిగట్టారు. 20 ఏళ్ల యువతిపై అయిదుగురు కామాంధులు కలసి కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం చేసిన ఘటన తమిళనాడులో రెండు రోజుల క్రితం సంచలనం చేసుకుంది.

చెన్నై దగ్గర్లోని కాంచిపురంలో ఈ ఘటన జరిగింది. సెల్‌ఫోన్‌ షాపులో పని చేస్తున్న బాధితురాలికి ఆమెతో పాటే పని చేస్తున్న గుణశీలన్‌ మత్తు పదార్థం కలిపిన డ్రింక్‌ ఇచ్చాడు. అది తాగిన బాధితురాలు మత్తులోకి జారుకుంది. గుణశీలన్‌ సహా మరో నలుగురు కలసి ఆమెను కారులో ఎక్కించి అత్యాచారం చేశారు. బాధితురాలు మెలకువలోకి వచ్చి కేకలు వేయడంతో రోడ్డుపై వెళుతూ పడేశారు. అటుగా వెళుతున్న ప్రయాణికులు అంబులెన్సుకు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోంది. పోలీసులు నిందితులను అరెస్టు (Four Accused Arrested) చేసి పలు సెక్షన్ల కింద ఈ నెల 9న కేసు నమోదు చేశారు.

ఆన్‌లైన్‌ ఫ్రెండ్ కోసం 300 కిలోమీటర్లు ప్రయాణం, అక్కడికి వెళ్లాక యువతిపై సామూహిక అత్యాచారం, బలవంతంగా మద్యం తాగించి, డ్రగ్స్ ఇచ్చి గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు ఆ యువతిని మరో స్నేహితుడికి పరిచయం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ బాధితురాలికి ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం ఇస్తామని వాగ్దానం చేసారు. సెప్టెంబర్ 8 న, బాధితురాలిని ప్రధాన నిందితుడు కారులో ఎక్కించుకుని కాంచీపురంలోని ఫాంహౌస్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఫామ్‌హౌస్‌కు వెళ్లే మార్గంలో, నిందితుడు మత్తుమందు కలిపిన శీతల పానీయాన్ని బాధితురాలికి ఇచ్చాడు, ఆమె దాన్ని తాగిన తర్వాత స్పృహ కోల్పోయింది. అనంతరం కారులోనే ఆమెపై విరుచుకుపడ్డారు.

బాధితురాలు స్పృహలోకి రాగానే కారు కిటికీని కాళ్లతో పగలగొట్టి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆమె తప్పించుకునే ప్రయత్నంలో అరుపులు విన్న కొంతమంది వ్యక్తులు కారు వైపు పరుగెత్తారు. అది చూసిన ఐదుగురు వ్యక్తులు అక్కడి నుండి పారిపోయారు. నిందితులు బాధితురాలిని చెన్నై-బెంగళూరు హైవేపై పడేశారని పోలీసులు తెలిపారు.