Tamil Nadu Shocker: మొగుడు కాదు శాడిస్ట్, మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను బతికుండగానే పాతిపెట్టాడు, తమిళనాడులో దారుణ ఘటన
ఓ వ్యక్తి యువతిని ప్రేమించాడు అలాగే పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నాడు.అనంతరం నాలుగేళ్లు కాపురం చేశాడు. చివరికి ఆమెను బతికుండగానే అడవిలో పాతిపెట్టాడు . తమిళనాడు వేలూరు జిల్లా కాట్పాడిలో ఈ దారుణం చోటు చేసుకుంది.
Vellore Mar 30: తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి యువతిని ప్రేమించాడు అలాగే పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నాడు.అనంతరం నాలుగేళ్లు కాపురం చేశాడు. చివరికి ఆమెను బతికుండగానే అడవిలో పాతిపెట్టాడు . తమిళనాడు వేలూరు జిల్లా కాట్పాడిలో ఈ దారుణం చోటు చేసుకుంది.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేలూరు జిల్లా కేవీ కుప్పం సమీపంలోని వడుగంతంగల్ గ్రామానికి చెందిన సుప్రజ, వినాయకం నాలుగేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే గత కొంతకాలంగా సుప్రజ అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ తరుణంలో జబ్బు పడ్డ ఆమెను వేధించసాగాడు వినాయకం. ఇంతలో మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని పెంచుకున్నాడు. ఈ విషయం సుప్రజకు తెలియడంతో విడాకులు ఇవ్వాలని వినాయగం ఒత్తిడి చేస్తూ తరచూ గొడవ పడేవాడు.
రెండు నెలల కిందట ఓరోజు భార్య సుప్రజను తీవ్రంగా కొట్టాడు కూడా. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. భార్య తన అక్రమ సంబంధానికి అడ్డుగా మారిందని భావించిన వినాయగం హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతను తన సోదరుడు విజయ్ (21), తన ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల యువకుడి సహాయం కోరాడు. వినాయకం తన భార్యను ఎలాగోలా ఒప్పించి కవాసంపట్టు వద్ద ఒక ప్రదేశానికి తీసుకువచ్చాడు, అక్కడ అతను విజయ్ మరియు యువకుడితో కలిసి ఆమెపై దాడి చేసి చంపాడు. ఆ తర్వాత ముగ్గురూ తమ పథకం ప్రకారం అప్పటికే తవ్విన గొయ్యిలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఇంతలో అనుమానం రాకుండా ఉండేందుకు సుప్రజ కనిపించకుండా పోయిందని పేర్కొన్నాడు.
సుప్రజ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. కేసును చేధించారు. విచారణలో, అతను తన భార్య మృతదేహాన్ని పూడ్చిపెట్టిన స్థలాన్ని పోలీసులు, రెవెన్యూ మరియు ఆరోగ్య అధికారులకు చూపించాడు. అటవీ ప్రాంతంలో పూడ్చిన సుప్రజ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అవశేషాలను వెలికితీసి ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. వినాయగం, విజయ్‌లను అరెస్టు చేయగా, బాలనేరస్థుడిని వేలూరు బోర్స్టాల్ పాఠశాలకు తరలించారు. సోదాలు కొనసాగుతున్నాయి.భర్త వినాయకంతో పాటు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. సుప్రజ మరణంతో ఆమె కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.