Jagtial District Crime: కారు కొనివ్వలేదని యాసిడ్ తాగిన యువకుడు, తల్లిదండ్రులు చెప్పిన వినకుండా ఆత్మహత్యా యత్నం, చికిత్స పొందుతూ మృతి..
Image used for representational purpose | (Photo Credits: PTI)

జగిత్యాల, మార్చి 29: జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కారు కొనివ్వలేదన్న కారణంతో ఓ యువకుడు యాసిడ్ తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన అంజయ్య-లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. అంజయ్య గీత పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉపాధి కోసం పెద్ద కుమారుడు దుబాయి వెళ్లాడు. చిన్న కుమారుడు భానుప్రకాష్‌ ఇంటర్‌ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు.

గత కొన్ని రోజులుగా తండ్రిని కారు కొనివ్వాలని అడుగుతున్నాడు. పెద్ద కుమారుడు దుబాయి నుంచి వచ్చిన తరువాత కొనిస్తానని తండ్రి చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కొత్త కారు కొనాల్సిందేనంటూ 15 రోజులుగా తల్లిదండ్రులను మరింత పట్టుపడుతూ వచ్చాడు. భానుప్రకాష్ కోరికను ఇంట్లో ఎవరూ పట్టించుకోవడం లేదనే బాధతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం రాత్రి గ్రామశివారులో యాసిడ్‌ తాగాడు. మంటకు తాళలేక అరుస్తూ రోడ్డుపై పరుగులు తీశాడు. గమనించిన స్థానికులు.. జరిగిన సంఘటనను అంజయ్యకు తెలిపారు.

బీజేపీని గద్దె దించడానికి అందరం ఏకమవుదాం, ప్రతిపక్షాలకు, బీజేపీ రహిత రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసిన బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

చికిత్స నిమిత్తం కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. గతంలో కూడా సెల్‌ఫోన్‌ కొనివ్వాలని కత్తితో చేయి కొసుకున్నట్లు మృతుడి తండ్రి తెలిపాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.