Tamil Nadu Road Accident: తమిళనాడులో తీవ్ర విషాదం, వినాయకుడి ఉరేగింపులో ట్రాక్టర్ బోల్తా, ముగ్గురు చిన్నారులు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉత్సవ ఊరేగింపు సందర్భంగా గణేశుడి విగ్రహాన్ని ట్రాక్టర్‌పై తరలిస్తుండగా వాహనం ఒక్కసారిగా బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Ganesha Statue | Dead Body File Pic (Photo Credit: Pixabay)

Chennai, Sep 9: తమిళనాడులోని తేని జిల్లాలో గణేశ చతుర్థి విగ్రహ ఊరేగింపు సందర్భంగా జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉత్సవ ఊరేగింపు సందర్భంగా గణేశుడి విగ్రహాన్ని ట్రాక్టర్‌పై తరలిస్తుండగా వాహనం ఒక్కసారిగా బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

నడిరోడ్డు మీద దారుణ హత్య, మోటర్‌సైకిల్‌పై నుండి ఈడ్చుకెళ్లి యువకుడిని హత్య చేసిన శత్రువులు, వీడియో ఇదిగో..

ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు ట్రాక్టర్‌తో పాటు నడుచుకుంటూ వెళుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను రక్షించి చికిత్స నిమిత్తం తేని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్‌లో మొత్తం 10 మంది ప్రయాణిస్తుండగా, ఇద్దరు బాలురు పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన ఐదుగురు స్వల్ప గాయాలతో ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ప్రాథమిక సమాచారం.